Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 6 స్పెషల్ ట్రైన్లు.. కాచిగూడ, తిరుపతితో పాటు..
Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో 6 స్పెషల్ ట్రైన్లు.. కాచిగూడ, తిరుపతితో పాటు..
భారీగా రద్దీ నెలకొన్న దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగుడ-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. దీంతో పాలు మరో 4 స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
Train No.07797: కాచిగూడ-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 20న నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
Train No.07798: తిరుపతి నుంచి కాచిగుడ కు ఈ నెల 21న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఈ రెండు రైళ్లు ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
ఈ ప్రత్యేక రైళ్లలో 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని ప్రకటనలో పేర్కొంది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)
5/ 7
ఇంకా మరో 4 స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
Train No.07413: తిరుపతి-జాల్నా ట్రైన్ ను ఫిబ్రవరి 7 నుంచి 28 వరకు, Train No.07414: జాల్నా-తిరుపతి ట్రైన్ ను ఫిబ్రవరి 12 నుంచి మార్చి 5 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. వీటితో పాటు.. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
Train No.07651: జాల్నా-ఛాప్రా ట్రైన్ ను ఫిబ్రవరి 8 నుంచి మార్చి 1 వరకు, Train No.07652: ఛాప్రా-జాల్నా ట్రైన్ ను ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ఫొటో: ట్విట్టర్)