రైలు నెంబర్ 17141 కాచిగూడ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 3, జనవరి 10న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో సాయంత్రం 4.20 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17142 కొల్లాం నుంచి కాచిగూడ వరకు 2022 జనవరి 5, జనవరి 12న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో అర్ధరాత్రి 12.05 గంటలకు బయల్దేరితే కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 10.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్ స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17117 హైదరాబాద్ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 4, జనవరి 11న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు హైదరాబాద్‌లో మధ్యాహ్నం 2.10 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17118 కొల్లాం నుంచి హైదరాబాద్ వరకు 2022 జనవరి 6, జనవరి 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో అర్ధరాత్రి 2.30 గంటలకు బయల్దేరితే హైదరాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగామ్, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17135 కాచిగూడ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 5, జనవరి 12న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో తెల్లవారుజామున 5.30 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17136 కొల్లాం నుంచి కాచిగూడ వరకు 2022 జనవరి 6, జనవరి 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో సాయంత్రం 5.10 గంటలకు బయల్దేరితే కాచిగూడకు మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు మల్కాజ్గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తనెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17137 నాందేడ్ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 6, జనవరి 13న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు నాందేడ్‌లో ఉదయం 9.45 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు బాసర, నిజామాబాద్, ఆర్మూరు, మెట్పల్లి, కోరుట్ల, లింగంపేట్ జగిత్యాల్, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, న్యూ గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17138 తిరుపతి నుంచి నాందేడ్‌కు వరకు 2022 జనవరి 9, జనవరి 16న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు తిరుపతిలో రాత్రి 8.15 గంటలకు బయల్దేరితే నాందేడ్‌కు మరుసటి రోజు మధ్యాహ్నం 3.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లి, కరీంనగర్, లింగంపేట్ జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూరు, నిజామాబాద్, బాసర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17109 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 7, జనవరి 14న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో రాత్రి 7.20 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 11.45 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17110 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 9, జనవరి 16న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో మధ్యాహ్నం 2.30 గంటలకు బయల్దేరితే సికింద్రాబాద్‌కు మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి, జనగామ్, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17133 సికింద్రాబాద్ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 8, జనవరి 15న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్‌లో తెల్లవారుజామున 5.40 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు మధ్యాహ్నం 1.40 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 17134 కొల్లాం నుంచి సికింద్రాబాద్ వరకు 2022 జనవరి 9, జనవరి 16న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో రాత్రి 7.35 గంటలకు బయల్దేరితే సికింద్రాబాద్‌కు మరుసటి రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07053 కాచిగూడ నుంచి కొల్లాం వరకు 2022 జనవరి 9న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కాచిగూడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరితే కొల్లాంకు మరుసటి రోజు రాత్రి 9.40 గంటలకు చేరుకుంటుంది. రైలు నెంబర్ 07054 కొల్లాం నుంచి కాచిగూడ వరకు 2022 జనవరి 11న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో అర్ధరాత్రి 2.30 గంటలకు బయల్దేరితే కాచిగూడకు మరుసటి రోజు తెల్లవారుజామున 6.00 గంటలకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, ఢోన్, గుత్తి, తాడిపత్రి, కొండపురం, ముద్దనూరు, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట్ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17506 కొల్లాం నుంచి తిరుపతి వరకు 2022 జనవరి 8, జనవరి 15న అందుబాటులో ఉంటుంది. ఈ రైలు కొల్లాంలో అర్ధరాత్రి 2.30 గంటలకు బయల్దేరితే తిరుపతికి మరుసటి రోజు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు చిత్తూరు, పాకాల మీదుగా తిరుపతికి చేరుకుంటుంది. అన్ని ప్రత్యేక రైళ్లల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఇవన్నీ ఫుల్లీ రిజర్వ్డ్ సర్వీస్ రైళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)