Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రద్దీ దృష్ట్యా 22 స్పెషల్ ట్రైన్స్.. ఈ రోజు నుంచే స్టార్ట్
Special Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రద్దీ దృష్ట్యా 22 స్పెషల్ ట్రైన్స్.. ఈ రోజు నుంచే స్టార్ట్
ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భారీగా రద్దీ నెలకొన్న దృష్ట్యా కాచిగూడ-తిరుపతి-కాచిగూడతో పాటు పలు ప్రాంతాల మధ్య 22 స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No.07797: కాచిగూడ-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 22న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 22.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
Train No.07798: తిరుపతి-కాచిగూడ మధ్య ఈ నెల 23న స్పెషల్ ట్రైన్ ను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ 16.35 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 06.00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
ఈ రెండు రైళ్లు ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట్, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
Train No.07426: నాందేడ్-ముంబాయి ఎల్టీటీ ట్రైన్ ను ఈ నెల 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆయా తేదీల్లో 21.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 13.30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
Train No.07427: ముంబాయి ఎల్టీటీ-నాందేడ్ ట్రైన్ ను జనవరి 31, ఫిబ్రవరి 7, 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 16.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:30 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
ఈ రెండు రైళ్లు పూర్ణ, హింగోళి, అకోలా, మల్కాపూర్, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్ స్టేషన్లో ఆగుతుందని ప్రకటనలో పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
Train No.07428: నాందేడ్-ముంబాయి ఎల్టీటీ ట్రైన్ ను ఈ నెల 25, ఫిబ్రవరి 2, 8, 15, 22 తేదీల్లో నడపనున్నట్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
Train No.07429: ముంబాయి ఎల్టీటీ-నాందేడ్ ట్రైన్ ను జనవరి 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆయా రోజుల్లో 16.55 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 09:00 గంటలకు గమ్యానికి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
ఈ రెండు రైళ్లు పూర్ణ, హింగోళి, అకోలా, మన్మాడ్, నాసిక్ రోడ్, కళ్యాణ్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. (ఫొటో: ట్విట్టర్)