Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఏపీ, తెలంగాణ మధ్య 14 స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
Sankranti Special Trains: ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఏపీ, తెలంగాణ మధ్య 14 స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
తెలుగు రాష్ట్రాల్లో మరో ముఖ్యమైన పండగ సంక్రాంతి. ఈ పండగకు అనేక మంది పట్టణాల నుంచి సొంత ప్రాంతాలకు వెళ్తుంటారు. దీంతో రైళ్లు, బస్సుల్లో అధిక రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య భారీగా స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
Train No 07275: కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య నాలుగు స్పెషల్ రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ రైళ్లు జనవరి 03, 05, 07 తేదీల్లో నడపనున్నారు. ఈ రైళ్లు ఆ తేదీల్లో రాత్రి 20.10 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 08:15 గంటలకు గమ్యానికి చేరుకుంటాయి.
2/ 10
Train No 07276: లింగంపల్లి-కాకినాడ టౌన్ స్పెషల్ ట్రైన్స్ ను జనవరి 04, 06,08 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ రాత్రి 18.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.10కి గమ్యానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు.
3/ 10
Train No 07491: కాకినాడ టౌన్-లింగంపల్లి మధ్య జనవరి 10, 12, 14, 17 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్స్ ఆ తేదీల్లో రాత్రి 20.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08.30 గంటలకు గమ్యాన్ని చేరుకుంటుంది.
4/ 10
Train No 07492: లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య జనవరి 13, 15, 18 తేదీల్లో నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ రోజుల్లో రాత్రి 18.40 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 06.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.
5/ 10
Train No 82714 (Suvidha): లింగంపల్లి-కాకినాడ టౌన్ మధ్య జనవరి 11న మరో స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ తేదీన సాయంత్రం 18.40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.
Train No 07485: సికింద్రాబాద్-బెర్హంపూర్ మధ్య జనవరి 9న స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. ఈ ట్రైన్ ఆ తేదీల్లో 17.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.
9/ 10
Train No 07486: బెర్హంపూర్-సికింద్రాబాద్ స్పెషల్ ట్రైన్ ను జనవరి 10న నడపనున్నారు. ఆ ట్రైన్ ఆ తేదీన 13 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 07.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.
10/ 10
ఈ రెండు ట్రైన్లు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో ఆగుతుంది.(ఫొటో: ట్విట్టర్)