రైలు నెంబర్ 07245 మచిలీపట్నం నుంచి గుడివాడ వరకు 2022 జనవరి 13 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 6.45 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి రాత్రి 7.45 గంటలకు గుడివాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07871 గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు 2022 జనవరి 13 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 8.35 గంటలకు గుడివాడలో బయల్దేరి రాత్రి 9.55 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07869 మచిలీపట్నం నుంచి గుడివాడ వరకు 2022 జనవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 2.25 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి మధ్యాహ్నం 3.30 గంటలకు గుడివాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 07880 గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు 2022 జనవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 3.45 గంటలకు గుడివాడలో బయల్దేరి సాయంత్రం 5.00 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 07898 విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 2022 జనవరి 13 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 9.30 గంటలకు విజయవాడలో బయల్దేరి అర్ధరాత్రి 12.25 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. రైలు నెంబర్ 07867 మచిలీపట్నం నుంచి విజయవాడ వరకు 2022 జనవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ తెల్లవారుజామున 3.20 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి తెల్లవారుజామున 5.55 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 08579 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 23 మధ్య ప్రతీ బుధవారం ప్రయాణిస్తుంది. రైలు నెంబర్ 08580 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 24 మధ్య ప్రతీ గురువారం ప్రయాణిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 08585 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 22 మధ్య ప్రతీ మంగళవారం ప్రయాణిస్తుంది. రైలు నెంబర్ 08586 సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు 2022 ఫిబ్రవరి 2 నుంచి ఫిబ్రవరి 23 మధ్య ప్రతీ బుధవారం ప్రయాణిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
రైలు నెంబర్ 17270 నర్సాపూర్ నుంచి విజయవాడ వరకు 2022 జనవరి 14 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 9.40 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 1.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రైలు నెంబర్ 17269 విజయవాడ నుంచి నర్సాపూర్ వరకు 2022 జనవరి 13 నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 4.40 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి రాత్రి 8.55 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
సంక్రాంతి రద్దీని క్లియర్ చేయడంతో పాటు ఆ తర్వాత ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ఈ రైళ్లను ప్రకటించింది. ప్రతీ రోజూ కొన్ని స్పెషల్ ట్రైన్స్ ప్రకటిస్తూనే ఉంది. వీటిలో కొన్ని రిజర్వ్డ్ ట్రైన్స్ అయితే, కొన్ని అన్రిజర్వ్డ్ రైళ్లు. రిజర్వ్డ్ రైళ్లకు ప్రయాణికులు ఆన్లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)