Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణలో 104 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఏపీ, తెలంగాణలో 104 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్
Summer Special Train: సమ్మర్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తన ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 104 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-ఎర్నాకులం, ఎర్నాకులం-సికింద్రాబాద్, మచిలీపట్నం-కర్నూల్ సిటీ, కర్నూల్ సిటీ-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లను నడపనున్నారు.
Train No.07189: సికింద్రాబాద్-ఎర్నాకులం మధ్య ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతీ శుక్రవారం ఈ రైలును నడపనున్నారు. ఈ రైలు ప్రతీ శుక్రవారం రాత్రి 21.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 20.15 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
Train No.07190: ఎర్నాకులం-సికింద్రాబాద్ మధ్య ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతీ శనివారం ఈ స్పెషల్ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు ప్రతీ శనివారం 23.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 23.30 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
Train No.07067: మచిలీపట్నం-కర్నూల్ సిటీ మధ్య ఏప్రిల్ 2 నుంచి జూన్ 30 వరకు ప్రతీ మంగళవారం, ప్రతీ గురువారం, శనివారం నడపనున్నారు. ఈ రైలు ఆయా రోజుల్లో సాయంత్రం 3.30 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 5.10 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Train No.07060: కర్నూల్ సిటీ-మచిలీపట్నం మధ్య ఏప్రిల్ 3 నుంచి జులై 1 వరకు ప్రతీ ఆదివారం, బుధవారం, శుక్రవారం ఈ ట్రైన్ ను నడపనున్నారు. ఈ రైలు రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.05 గంటలకు గమ్యానికి చేరుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)