1. వేసవి సెలవుల కారణంగా తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ పెరిగింది. దీంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనానికి ఏకంగా 20 గంటల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతికి వెళ్లే భక్తుల రద్దీ పెరగడంతో భారతీయ రైల్వే (Indian Railways) రద్దీని క్లియర్ చేసేందుకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దక్షిణ మధ్య రైల్వే మరో 10 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. రైలు నెంబర్ 07091 కాజిపేట నుంచి తిరుపతికి మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఈ రైల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 11 గంటలకు కాజిపేటలో రైలు బయల్దేరితే అదే రోజు రాత్రి 10.20 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. దారిలో వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇక రైలు నెంబర్ 07092 తిరుపతి నుంచి కాజిపేటకు మే 31, జూన్ 7, 14, 21, 28 తేదీల్లో ఈ రైల్లో అందుబాటులో ఉంటుంది. రాత్రి 11.40 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు కాజిపేట చేరుకుంటుంది. దారిలో రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, కేసముద్రం, వరంగల్ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక ఇంతకు ముందే తిరుపతికి మరిన్ని ప్రత్యేక రైళ్లను నడిపింది భారతీయ రైల్వే. రైలు నెంబర్ 02764 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి జూన్ 4, 11, 18, 25 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 6.40 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతికి రైలు చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. రైలు నెంబర్ 07263 తిరుపతి నుంచి సికింద్రాబాద్కు జూన్ 5, 12, 19, 26 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లు దారిలో జనగాం, కాజిపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)