1. భారతీయ రైల్వే కొన్నాళ్ల క్రితం ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో లగ్జరీ స్లీపింగ్ పాడ్స్ (Sleeping Pods) ప్రారంభించిన సంగతి తెలిసిందే. త్వరలో ఇదే సదుపాయాన్ని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్లో ప్రారంభించనుంది ఐఆర్సీటీసీ. ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్‌గా పిలిచే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్లో త్వరలో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. రైలు ఆలస్యమైతే ప్రయాణికులు ప్లాట్‌ఫామ్స్ పైనే గంటలపాటు వేచి ఉండాల్సి ఉంటుంది. లేదా ఒక స్టేషన్లో రైలు దిగి, మరో రైలు ఎక్కడానికి కొన్ని గంటల సమయం ఉంటే ఎక్కడ సేదతీరాలన్న టెన్షన్ ప్రయాణికుల్లో ఉంటుంది. రిటైరింగ్ రూమ్‌లో డబ్బులు చెల్లించి విశ్రాంతి తీసుకోవచ్చు. కాస్త లగ్జరీగా సేదతీరాలనుకునేవారికి స్లీపింగ్ పాడ్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. హోటల్లో గది తీసుకోవాలంటే ఎక్కువ ఖర్చు చేయకతప్పదు. అందుకే తక్కువ బడ్జెట్లో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం స్లీపింగ్ పాడ్స్ ముంబైలోని రైల్వే స్టేషన్లో మాత్రమే ఉన్నాయి. త్వరలో ఢిల్లీ జంక్షన్ రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వస్తాయి. ఇందుకోసం టెండర్‌ను ఇప్పటికే ఆహ్వానించింది భారతీయ రైల్వే. (ప్రతీకాత్మక చిత్రం)