1. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఇచ్చే వ్యాపారం (Business with Low investment) చేయాలనుకుంటున్నారా? రూ.1,00,000 లోపు పెట్టుబడితో చాలా వ్యాపారాలు ఉంటాయి. అలాంటి వ్యాపారాల్లో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ (Rooftop Solar Panels) కూడా ఒకటి. మీ ఇంటి పైన ఖాళీ స్థలం ఉంటే ఈ బిజినెస్ చేయొచ్చు. ఇందుకోసం మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సప్లై చేయొచ్చు. రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్స్ ఏర్పాటుచేసేవారికి కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ 30 శాతం సబ్సిడీ కూడా ఇస్తుంది. సబ్సిడీ లేకుండా రూఫ్‌టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే రూ.1,00,000 ఖర్చవుతుంది. ఈ పెట్టుబడిపై 30 శాతం సబ్సిడీ పొందొచ్చు. అంటే రూ.30,000 సబ్సిడీ రూపంలో లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి లక్ష రూపాయలు ఖర్చవుతుంది. వేర్వేరు రాష్ట్రాల్లో ఖర్చు వేర్వేరుగా ఉంటుంది. ప్రభుత్వ సబ్సిడీ మినహాయించిన తర్వాత కిలోవాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి రూ.60 వేల నుంచి రూ.70 వేలు ఖర్చవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్రాలు ఇచ్చే సబ్సిడీ అదనంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. రూ.60 వేల నుంచి రూ.70 వేలు పెట్టుబడి కూడా బ్యాంకు నుంచి లోన్ తీసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులు లోన్ ఇస్తాయి. సోలార్ సబ్సిడీ స్కీమ్, కుసుమ్ యోజన, నేషనల్ సోలార్ ఎనర్జీ మిషన్ పథకాల కింద బ్యాంకుల నుంచి ఎస్ఎంఈ లోన్ తీసుకోవచ్చు. ఈ వ్యాపారం ద్వారా నెలకు రూ.30,000 నుంచి రూ.1,00,000 వరకు సంపాదించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ కార్యాలయం లేదా వెబ్సైట్లో సమాచారం తెలుసుకోవచ్చు. ఒక సోలార్ ప్యానెల్ జీవిత కాలం 25 ఏళ్లు. సులువుగా సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేయొచ్చు. మెయింటనెన్స్ ఖర్చు కూడా ఎక్కువేమీ ఉండదు. కానీ 10 ఏళ్లకోసారి బ్యాటరీ మార్చాల్సి ఉంటుంది. ఒక బ్యాటరీ ఖర్చు రూ.20,000. (ప్రతీకాత్మక చిత్రం)
6. సోలార్ ప్యానెల్స్‌ని ఒక చోటి నుంచి మరో చోటికి తీసుకెళ్లొచ్చు. ప్యానెల్ నుంచి ఉత్పత్తి అయ్యే ఇంధనం ఉచితం. మీ ఇంటికి కావాల్సిన ఇంధనాన్ని వాడుకొని మిగతా ఇంధనాన్ని ప్రభుత్వానికి లేదా ఏదైనా కంపెనీకి గ్రిడ్ ద్వారా అమ్ముకోవచ్చు. మీరు మీ ఇంటిపై రెండు కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేశారనుకుందాం. రోజులో 10 గంటలు సూర్యుడి నుంచి ఎండ తగుల్తూ ఉంటుంది. 10 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ లెక్కన నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సోలార్ ప్యానెల్స్ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి విభాగంలో సంప్రదించొచ్చు. అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ఈ కార్యాలయాలు ఉంటాయి. ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా సోలార్ ప్యానెల్స్ అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)