భారతీయ రైల్వే , వందే భారత్ ఎక్స్ ప్రెస్, వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతీయ రైల్వేలు, రైల్వేలు, కొత్త వందే భారత్" width="1600" height="1600" /> బుల్లెట్ ట్రైన్లను తలపించేలా దేశంలో ప్రవేశపెట్టిన ‘వందేభారత్’ (VandeBharath Trains) రైల్వే సర్వీసులను మరింత విస్తరించనున్నారు. ప్రస్తుతం కూర్చోవడానికి మాత్రమే వీలున్న చైర్ కార్ సీట్లతో రూపుదిద్దుకున్న వందేభారత్ రైళ్లు పట్టాలపై నడుస్తున్నాయి.
విజయవాడ వందే భారత్ రైలు, సికింద్రాబాద్ వందే భారత్ ట్రైన్" width="1200" height="800" /> వివిధ మార్గాలలో ప్రయాణం చేస్తూ రైల్వే ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. అయితే త్వరలోనే వందేభారత్ రైళ్లలో స్లీపర్ వెర్షన్స్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ముందడుగు పడింది. రైల్వే శాఖ టెండర్లు జారీ చేసింది. త్వరలోనే ప్రక్రియ షురూ కానుంది.
విశాఖపట్నం వందే భారత్ ట్రైన్" width="1200" height="675" /> దేశీయంగా రూపొందిన వందేభారత్ రైళ్లను సెమీ బుల్లెట్ ట్రైన్లుగా అభివర్ణిస్తున్నారు. వీటిలో ప్రయాణించే వారికి ఓ విమానంలో ప్రయాణిస్తున్న ఫీలింగ్ ఉంటుంది. కోచ్‌లలో అత్యాధునిక సౌకర్యాలు, హోస్టెస్ సర్వీసులు ఉండటంతో ప్రయాణికులు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు అట్రాక్ట్ అయ్యారు.
దీంతో పాటు వేగంగా గమ్యాలకు చేరుస్తుండటంతో, వీటిలో ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే, దూర ప్రదేశాలకు ప్రయాణించాలంటే మాత్రం కాస్త జంకుతున్నారు. చైర్ కార్ వ్యవస్థ వల్ల దూర ప్రయాణాలకు వెనకడుగు వేస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే రైల్వే శాఖ స్లీపర్ వెర్షన్ వందేభారత్ రైళ్లను తీసుకొస్తోంది.
* టెండర్లు : 400 వందేభారత్ రైళ్లకు రైల్వే శాఖ ఇప్పటికే టెండర్లను ఆహ్వానించింది. స్వదేశీ సంస్థలతో పాటు విదేశీ కంపెనీలు కూడా టెండర్లు దక్కించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 4 ప్రధాన దేశీయ కంపెనీలు వందేభారత్ రైళ్ల ఉత్పత్తికి ముందుకొచ్చాయని పేర్కొన్నారు. ఈ టెండర్లకు సంబంధించిన ప్రక్రియ జనవరి నెలాఖరులోగా పూర్తి కానున్నట్లు అధికారులు వెల్లడించారు.
* ఇదీ ప్లాన్.. : ప్రణాళిక ప్రకారం తొలుత 200 వందేభారత్ చైర్ కార్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకు రానున్నారు. ప్రస్తుతం శతాబ్ది ఎక్స్‌ప్రెస్ నడుస్తున్న ట్రాక్‌పై ఈ రైళ్లను నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గంటకు 180కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. అయితే, ట్రాక్‌ల నాణ్యత, ట్రాక్‌ల వెంబడి సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ట్రైన్ వేగాన్ని గంటకు 130కిలోమీటర్లకు పరిమితం చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ విజయవాడ వందే భారత్ రైలు" width="1200" height="800" /> * సెకండ్ ఫేజ్‌లో : రెండో విడతలో 200 స్లీపర్ వెర్షన్ రైళ్లను తీసుకురానున్నారు. గరిష్ఠంగా గంటకు 200కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా వీటిని తీర్చిదిద్దనున్నారు. చైర్ కార్ రైళ్లలా కాకుండా ప్రత్యేకంగా అల్యుమినియంతో ఈ ట్రైన్స్ తయారు చేస్తారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రూట్లో ఈ ట్రైన్లను నడపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు ఢిల్లీ- ముంబయి, ఢిల్లీ- కోల్కత్తా రైల్వే ట్రాక్‌లను వందేభారత్ రైళ్లకు అనుగుణంగా సిద్ధం చేయనున్నారు. ట్రాక్‌లను మరింత నాణ్యంగా చేయడం, ట్రాక్‌ల వెంబడి కంచెలను ఏర్పాటు చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడం, యాంటీ కొల్లిషన్ టెక్నికల్ ఆర్మర్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
* వీలైతే ఫస్ట్ ఫేజ్‌లోనే : అవసరమైతే మొదటి విడతలోనే స్లీపర్ వెర్షన్ రైళ్లను తయారు చేసే ఛాన్స్ ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. స్లీపర్ వెర్షన్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికులు ఆతురతతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల అంచనాలకు తగ్గట్టుగా ఈ వందేభారత్ రైళ్లను సిద్ధం చేసే పనిలో రైల్వే శాఖ ఉందని చెప్పారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ట్రైన్ డిజైన్ని రూపొందించారు. అల్యుమినియం లోహంతో ఈ స్లీపర్ వెర్షన్ రైళ్లను తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న వందేభారత్ రైళ్లు ఉక్కు(స్టీల్)తో తయారయ్యాయి.