Simple One : సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 300కి.మీ మైలేజ్
Simple One : సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్.. 300కి.మీ మైలేజ్
Simple One : ఎలక్ట్రిక్ స్కూటర్లలో సాధారణంగా తక్కువ మైలేజ్ ఉంటుంది. కానీ ఇండియాలో రాబోతున్న ఈ స్కూటర్లో ఎక్కువ మైలేజ్ ఉండేలా ఫోకస్ పెడుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Simple One : ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల ఉత్పత్తి బాగా పెరిగింది. ఆటోమొబైల్ కంపెనీలు సైతం.. సరికొత్త ఎలక్ట్రిక్ వెహికిల్స్ పరిచయం చేస్తున్నాయి. ఆ కోవలోనే రాబోతోంది సింపుల్ వన్ స్కూటర్. (image credit - www.simpleenergy.in)
2/ 9
బెంగళూరుకి చెందిన సింపుల్ ఎనర్జీ కంపెనీ సింపుల్ వన్ స్కూటర్ని ఉత్పత్తి చేస్తోంది. దీన్ని వచ్చే సంవత్సరం మార్చిలో మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. (image credit - www.simpleenergy.in)
3/ 9
ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన కంపెనీ.. స్కూటర్‌కి సంబంధించిన ఫీచర్ల వివరాల్ని వెబ్సైట్లో ఉంచింది. ఐతే.. తయారీ ఇంకా ప్రారంభం కాలేదు. 2023 జనవరి 19న ఉత్పత్తి మొదలవుతుంది. (image credit - www.simpleenergy.in)
4/ 9
ఈ కంపెనీ తమిళనాడులోని షూలగిరి దగ్గర ఉంది. మొత్తం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టి.. భారీ కంపెనీని ఏర్పాటు చేశారు. అందులో ఏటా 10 లక్షల టూవీలర్లను ఉత్పత్తి చేసే వీలుంది. (image credit - www.simpleenergy.in)
5/ 9
2023 మార్చి నుంచి ఈ స్కూటర్ల డెలివరీ మొదలవుతుంది. మొదట్లో ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధరను రూ.1.10 లక్షలుగా తెలిపారు. ఐతే.. ఈ ధర కొద్దిగా పెరగవచ్చని అంటున్నారు. (image credit - www.simpleenergy.in)
6/ 9
ఈ స్కూటర్ని ఇండియాలో మొదటి ప్రీమియం ఎఫర్డబుల్ ఈవీగా చెబుతున్నారు. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకూ మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఇది గంటకు 105 కి.మీ వేగంతో వెళ్తుందని అంటున్నారు. (image credit - www.simpleenergy.in)
7/ 9
ఈ స్కూటర్లలో మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయి. బ్రాజెన్ బ్లాక్, నమ్మా రెడ్, అజ్యూర్ బ్లూ, గ్రేస్ వైట్ కలర్స్ ఉన్నాయి. (image credit - www.simpleenergy.in)
8/ 9
ఈ స్కూటర్ నేవిగేషన్ డిస్ ప్లేని కస్టమర్లు తమకు నచ్చిన విధంగా మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. డిస్ ప్లే ద్వారా మ్యాప్, ఫోన్ కాల్, మ్యూజిక్ ప్లే వంటివి చేసుకోవచ్చని తెలిపారు. (image credit - www.simpleenergy.in)
9/ 9
ఈ స్కూటర్ని యాప్‌తో కూడా ఆపరేట్ చేయవచ్చని చెబుతున్నారు. రిమోట్ లాక్ ఫీచర్ కూడా ఉందంటున్నారు. ఈ స్కూటర్ బరువు 115 కేజీలు కాగా.. బూట్ స్పేస్ 30 లీటర్లు అని తెలిపారు. (image credit - www.simpleenergy.in)