SILVER PRICE CROSSED RS 60000 MARK IN MCX KNOW TODAYS GOLD AND SILVER RATES SS
Gold Silver Price: ఒక్క రోజే రూ.3,000 పెరిగిన వెండి... దూసుకెళ్తున్న బంగారం... ఇవాళ్టి రేట్స్ ఇవే
Gold Silver Price Today | బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నాయి. బంగారంతో పోటీపడి మరీ వెండి ధర పెరుగుతోంది. ఇవాళ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
1. బంగారం ధర పరుగులు తీస్తోంది. వెండి రేటు కూడా ఆగట్లేదు. అంచనాలకు అందట్లేదు. రేటు బాగా పెరిగిపోతోంది. వెండి ధర ఒక్క రోజే రూ.3,000 పెరగడం సంచలనంగా మారింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
2. మామూలుగా బంగారం ధరలు ఎప్పుడూ వార్తల్లో ఉంటాయి. కానీ ఇప్పుడు వెండి గురించే మొదట మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మల్టీ కమాడిటీ ఎక్స్ఛేంజ్తో పాటు దేశీయ మార్కెట్లో వెండి ధర భారీగా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
3. ఎంసీఎక్స్‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో ధర రూ.60,000 మార్క్ దాటింది. ఒక్కరోజులోనే ఏకంగా 4.90 శాతం అంటే రూ.2,807 పెరిగి రూ.60,149 దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
4. దేశీయ మార్కెట్లో కూడా వెండి ధర దూసుకెళ్తోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ఏకంగా రూ.3,550 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.58,950. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
5. ఇక బంగారం ధరలు చూస్తే ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఆగస్ట్ ఫ్యూచర్స్ 0.91 శాతం అంటే రూ.453 పెరిగి రూ.49,980 ధర దగ్గర ట్రేడ్ అవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
6. ఇక హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.830 పెరిగి రూ.52,200 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
7. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారట్ బంగారం 10 గ్రాములపై రూ.760 పెరిగి రూ.47,850 ధరకు చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
8. కరోనా వైరస్ వ్యాక్సిన్లపై పాజిటీవ్ న్యూస్ వస్తుండటం, ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమల్లో కార్యకలాపాలు మళ్లీ గాడిలో పడుతుండటం లాంటి కారణాలతో వెండి ధర పెరుగుతుందని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
9. మరోవైపు బంగారం ధర భారీగా పెరిగిపోతుండటం, ఇతర అసెట్స్‌పై పెట్టుబడులు రిస్క్ అని భావిస్తున్న ఇన్వెస్టర్లు తమ పెట్టుబడికి వెండి సురక్షితమనుకుంటున్నారు. అందుకే వెండి ధర భారీగా పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)