కొవిడ్(Covid) కారణంగా రెండేళ్లుగా స్టాక్మార్కెట్లో(Stock Market) హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్‌మార్కెట్ సూచీలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అణు ఆయుధాలు భారీగా ఉన్న రష్యా.. ఉక్రెయిన్‌పై దండెత్తుతుండటంతో ఆ దేశ సరిహద్దులోని యూరోపిన్ కంట్రీలు ప్రమాదపు అంచున నిల్చుని ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
మార్చి మొదటివారంలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం త్వరగా ముగుస్తుందా?, ఎక్కువ రోజులు కొనసాగుతుందా?, మరిన్ని దేశాలు యుద్ధంలో భాగమయ్యే అవకాశం ఉందా? అనే అంశాలపై ఎవరికీ స్పష్టత లేదు. ఇంతటి అనిశ్చిత పరిస్థితుల మధ్య స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని మార్చుకోవాల్సిన సమయం ఇదే. (ప్రతీకాత్మక చిత్రం)
యుద్ధాలు మొదలై మార్కెట్ పపడిపోవడం కొత్త కాదు
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం ప్రపంచ దేశాలపై చూపనున్న ప్రభావం నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు(Global Markets) కుప్పకూలాయి. ఈరోజుల్లో మార్కెట్లు ఇలా స్పందించడం సాధారణ అంశమే. ప్రపంచంలో ఈ పరిస్థితుల్లో ఊహించని విధంగా ముప్పు తలెత్తితే వాటి ప్రభావాల నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే గతంలో యుద్ధాలు సంభవించిన సమయాల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితి, సమస్యలు పరిశీలిస్తే కచ్చితమైన స్పష్టత వస్తుంది.
1997-98 ఆర్థిక సంక్షోభం సమయంలో కొన్ని నెలల్లోనే సెన్సెక్స్ 4000 పాయింట్ల నుంచి 2700 పాయింట్లకు పడిపోయింది. అయితే అక్కడి నుంచి మార్కెట్లో రికవరీ మొదలై దాదాపు 5,900 పాయింట్లకు సెన్సెక్స్ దూసుకెళ్లింది. దాదాపు రెట్టింపు స్థాయికి మార్కెట్ వెళ్లింది. అనంతరం 2000 సంవత్సరంలో డాట్‌కామ్ క్రాష్, 2001లో 9/11 దాడులు చోటుచేసుకొన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
చాలా మంది మొదటిసారిగా మార్కెట్లో ఒడిదొడుకులను 2008-09 సమయంలో చూసి ఉంటారు. ఆర్థిక సంక్షోభంతో సెన్సెక్స్ ఏడాదిలోనే 21000 పాయింట్ల నుంచి 8000 వేల పాయింట్లకు పడిపోయింది. అనంతరం పెరగడం మొదలైన సూచీ 2019కి 40000కి చేరింది. కొవిడ్ ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన సమయంలో మార్కెట్లో 2020 మార్చి నెలలోనే 30 నుంచి 40 శాతం కరెక్షన్ కనిపించింది. (ప్రతీకాత్మక చిత్రం)
కొన్ని వారాల్లోనే సెన్సెక్స్ 25000 పాయింట్లకు పడిపోయింది. అనంతరం కొన్ని నెలల్లో మార్కెట్ తిరిగి 62000 పాయింట్లను అందుకొంది. విపత్తుల సమయంలో ఇన్వెస్టర్లు అందరికీ ఒకే ఆలోచన ఉంటుంది. మార్కెట్ రికవర్ అవుతుందా? మరింత కిందకు పోతుందా? అని. కానీ మార్కెట్లు ఎప్పటికైనా సరే రికవర్ అవుతాయి. ఇలాంటి సమయాల్లో పెట్టుబడులు చేసిన వారే ఊహించని లాభాలు అందుకొంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
పెట్టుబడులు కొనసాగించండి
గతంలో స్టాక్‌మార్కెట్లు యుద్దాలను, ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను చూశాయి. అలానే ప్రతిసారి తిరిగి కొత్త ఎత్తులకు చేరుకొన్నాయి. ఈ సారి కూడా అదే పునరావృతమవుతుంది. ఎక్కువగా నెగెటివ్ న్యూస్ వస్తున్న సమయంలో మార్కెట్లో ఎక్కువ కరెక్షన్ ఉంటుంది. పెట్టబడిదారులు భయాందోళనకు గురవుతారు. ఏదో ఒకటి చేయాలని ఎక్కువగా స్పందిస్తారు. అయితే ఈ సమయంలోనే స్థిరంగా ఉండి మార్కెట్లో ఉన్న వొలట్యాలిటీని ఉపయోగించుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇంకా పెట్టుబడులు పెట్టండి
‘నెవర్ లెట్ ఏ గుడ్ క్రైసిస్ టూ గో వేస్ట్’ అని విన్స్టన్ చర్చిల్ ఒకసారి అన్నారు. ఇది స్టాక్‌మార్కెట్‌కు సరిగా సరిపోతుంది. మీరు దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశిస్తుంటే పెట్టుబడుల్లో ఎలాంటి మార్పులు వద్దు. ఇప్పుడు అవలంబిస్తున్న పద్ధతినే కొనసాగించండి. విపత్తులు ఈక్విటీ మార్కెట్లో షేర్లను తక్కువ ధరలకు కొనే అవకాశాన్ని కల్పిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)