South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు ప్రారంభం.. పూర్తి సమాచారం తెలుసుకోండి..
South Central Railway: తెలుగు రాష్ట్రాల మీదుగా పలు రైళ్లు ప్రారంభం.. పూర్తి సమాచారం తెలుసుకోండి..
South Central Railway: కరోనా మహమ్మారి రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం చూపింది. దీంతో పెద్ద సంఖ్యలో రైళ్లు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి దిగి వస్తుండడంతో రైల్వేశాఖ మళ్లీ పలు రైళ్ల సర్వీసులను పట్టాలెక్కిస్తోంది. లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది.
కరోనా కారణంగా ఇప్పటికే రైల్వే శాఖ అధికారులు పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో రైళ్లను తిరగి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
2/ 13
తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు భారతీయ రైల్వే పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 13
పలు రూట్లలో తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 13
అందులో ముఖ్యంగా ట్రైన్ నంబర్ (02603) చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ట్రైన్‌ను గురువారం నుంచి, (ప్రతీకాత్మక చిత్రం)
5/ 13
ట్రైన్ నంబర్ (02604) హైదరాబాద్-చెన్నై సెంట్రల్ ట్రైన్‌ను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 13
ఇదిలా ఉండగా.. కాచిగూడ – రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ను సైతం బుధవారం నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 13
లింగంపల్లి-విజయవాడ ఇంటర్సిటీ రైలును దక్షిణమధ్య రైల్వే పునరుద్ధరించింది. కరోనా నేపథ్యంలో జూన్ 2న అధికారులు ఈ సర్వీసును రద్దుచేశారు. ప్రతీకాత్మక చిత్రం)
8/ 13
అయితే నేటి నుంచి రైలు సర్వీసును మళ్లీ ప్రారంభించారు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 13
ఉదయం 4.40 గంటలకు బయలుదేరిన ఈ ఇంటర్సిటీ రైలు (02796) 10.30 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 13
మళ్లీ సాయంత్రం 5.30కి విజయవాడలో బయలుదేరి రాత్రి 11.20 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. ప్రతీకాత్మక చిత్రం
11/ 13
అమరావతిలోని సెక్రటేరియట్లో పనిచేసే ఉద్యోగులు అత్యధికంగా ఈ రైలులో ప్రయాణిస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)