SEVERAL SPECIAL TRAINS WILL RUN FROM SECUNDERABAD SOUTH CENTRAL RAILWAY OFFICIALS SAID VB
South Central Railway Special Trains: సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభం.. పూర్తి వివరాలివే..
South Central Railway Special Trains: సికింద్రాబాద్ నుంచి పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా సెకండ్ వేవ్ మొదలైన దగ్గర నుంచి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడిప్పుడే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 10
దీంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను సడలింపులు ఇస్తున్నాయి. లాక్ డౌన్(Lock down) కాలంలో రైళ్ల సర్వీసులను పలు దఫాలుగా రద్దు చేసిన రైల్వే అధికారులు వాటిని నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 10
దీనిలో భాగంగా ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 10
ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకోవాలి. వాటికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 10
ప్రతి శుక్రవారం నడిచే షాలిమార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 02450) సికింద్రాబాద్-షాలిమార్ జూన్ 11, 18, 25, జూలై 2 న నడుస్తుందని అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 10
అంతేకాకుండా ప్రతి బుధవారం నడిచే షాలిమార్-సికింద్రాబాద్ (02449) రైలు ఈ నెల 16, 23, 30 తేదీలలో నడుస్తుందని తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 10
ప్రతి గురువారం నడిచే హౌరా-యశ్వంత్పూర్ (02469) ఎక్స్ ప్రెస్ జూన్ 10, 17, 24 తేదీల్లో నడపనున్నట్లు.. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 10
ప్రతి ఆదివారం నడిచే యశ్వంత్పూర్-హౌరా రైలు (02470) జూన్ 13, 20, 27 తేదీల్లో నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)