ప్రస్తుతం చాలా ప్రైవేట్ బ్యాంకులు 8 శాతం లేదా ఆంత కన్నా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే 7.5 శాతం వరకు వడ్డీని అందుబాటులో ఉంచాయి. సీనియర్ సిటిజన్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. దీంతో వీరికి అధిక రాబడి లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ అందించే బ్యాంకులు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటివి అయితే 8 శాతానికి పైగా వడ్డీని అందుబాటులో ఉంచాయి. అధిక వడ్డీ కావాలని భావించే వారు ఈ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయొచ్చు.