Electric Scooter | బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ ఐగోవైజ్ మొబిలిటీ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. బిగో ఎక్స్4 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 26న లాంచ్ చేయనుంది. అలాగే కంపెనీ ట్రిగో ఎలక్ట్రిక్ వెహికల్‌ను తీసుకురానుంది.
కాగా ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ బాగుంది. ఓలా, ఏథర్, హీరో ఎలక్ట్రిక్, టీవీఎస్ వంటి కంపెనీలు అదరగొడుతున్నాయి. అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీలు ఆకర్షణీయ ఫైనాన్స్ స్కీమ్స్‌ను కూడా అందిస్తున్నాయి. దీని వల్ల అమ్మకాల్లో మంచి పెరుగుదల నమోదు అవుతూ వస్తోంది.
ఇప్పుడు ఈ కొత్త కంపెనీ కూడా తన కొత్త ప్రొడక్టులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రెడీ అవుతోంది. కొత్త వెహికల్ ప్రిబుకింగ్స్ కూడా రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. కంపెనీ వెబ్సైట్లోకి వెళ్లి నేరుగా మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయొచ్చు. ఇంకా ఈ కొత్త ప్రొడక్ట్‌కు సంబంధించిన పలు రకాల ఫీచర్ల తెలుసుకోవచ్చు.