Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ఈ 4 స్టేషన్లలోనే ఆగుతుందట
Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు.. ఈ 4 స్టేషన్లలోనే ఆగుతుందట
Secunderabad-Tirupati Vande Bharat Train: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇప్పటికే రూట్ కూడా ఖరారయింది. సికింద్రాబాద్ నుంచి వెళ్లే ఈ రైలు.. మరి ఏయే స్టేషన్లలో ఆగుతుందో తెలుసుకుందాం,
తెలుగు రాష్ట్రాలకు రెండో వందే భారత్ రైలు రానుంది. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఏపీలోని విశాఖపట్టణానికి వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో మరో రైలు రాబోతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రధాని మోదీ వర్చువల్ వేదికగా జెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు ప్రస్తుతం నాలుగు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రస్తుతం నారాయణాద్రి రైలు నడుస్తున్న మార్గంలో.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెడతారని తెలుస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
తిరుపతి వందేభారత్ రైలును మొదట నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ రూట్లోనే నడుపుతారట. శావల్యపురం-ఒంగోలు రూట్ పూర్తయ్యాక.. ఈ మార్గం నుంచి నడుపుతారని తెలుస్తోంది. న్యూ పిడుగురాళ్ల జంక్షన్ నుంచి శావల్యపురం, ఒంగోలు మీదుగా తిరుపతికి నడుపుతారట. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య రాకపోకలు సాగించే ఈ రైలు మధ్యలో.. నాలుగు స్టేషన్లలో మాత్రమే ఆగుతుందట. నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరులో రైలు ఆగుతుందని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
ప్రస్తుతం నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్.. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లేందుకు 12 గంటల సమయం పడుతోది. అదే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 140-150 కి.మీ. వేగంతో... కేవలం ఆరున్నర గంటల్లోనే తిరుపతికి చేరుకుంటుందట. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ రేటు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. జీఎస్టీ, తత్కాల్ సర్‌చార్జీతో కలిపి ఛైర్ కార్ టికెట్ ధర రూ.1150 నుంచి ప్రారంభం కానుంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2వేలు దాటవచ్చని సమాచారం. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
రైలు నెంబరు, టైమింగ్స్‌తో పాటు టికెట్ల ధరలపై అతి త్వరలోనే స్పష్టత రానుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ రైలును నడపాలని శ్రీవారి భక్తుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ రైలు వస్తే తిరుపతికి చాలా త్వరగా.. సౌకర్యవంతంగా చేరుకోవచ్చని చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)