1. ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలు (Vande Bharat Train) పరుగులు తీయనుంది. జనవరిలో సంక్రాంతి కానుకగా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలు కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. సికింద్రాబాద్-తిరుపతి రూట్లో వందే భారత్ రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రారంభించనుంది. ఇప్పటికే రూట్ ఫైనలైజ్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వేర్వేరు రూట్లల్లో ప్రస్తుతం రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక రూట్లో మాత్రమే వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మొదట సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును విజయవాడ నడపాలని అనుకున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు విజయవాడ మీదుగా వెళ్తోంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో వందే భారత్ రైలు ఆగుతోంది. కాబట్టి మరో రూట్లో వందే భారత్ రైలును నడిపితే ఎక్కువ జిల్లాలు కవర్ అవుతాయని రైల్వే భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఏప్రిల్ 8న ప్రారంభం కాబోయే సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలును నల్గొండ, గుంటూరు మీదుగా నడపాలని భారతీయ రైల్వే భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ రూట్లో నారాయణాద్రి, శబరి ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. నారాయణాద్రి రైలు లింగంపల్లిలో బయల్దేరి బేగంపేట్, సికింద్రాబాద్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు కేవలం ప్రధాన రైల్వే స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది. సికింద్రాబాద్లో బయల్దేరే వందే భారత్ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరుపతి వెళ్లే అవకాశం ఉంది. అయితే తిరుపతి వందే భారత్ రైలు ఏఏ స్టేషన్లో ఆగుతుందో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు వారానికి ఆరు రోజులు మాత్రమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ రైలు కూడా ఆదివారం తప్ప ఇతర రోజుల్లో మాత్రమే నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ట్రైన్ కూడా ఆదివారం తప్ప ఇతర రోజుల్లో అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)