దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల అంటే అక్టోబరు 1 నుంచి కొన్ని ట్రైన్స్ టైమింగ్స్ మార్చినట్లు తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన విడుదల చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ జర్నీ ప్లాన్ చేసుకోవాలని సూచించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ ట్రైన్లు కొల్లాం, ఎర్నాకులం, ఆలువా, సేలం, గూడురు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం తదితర స్టేషన్లలో ఆగుతుందని అధికారులు వెల్లడించారు. (ఫొటో: ట్విట్టర్)