SBI RELEASED KEY INSTRUCTIONS TO ATM CARD USERS HERE FULL DETAILS NS
SBI ATM: ఏటీఎం వాడేవారికి అలర్ట్.. ఇవి తప్పక పాటించాలన్న ఎస్బీఐ.. తప్పక తెలుసుకోండి
ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు (Cyber Crimes) అధికంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ ఉంటుంది. తాజాగా ఎస్బీఐ తన ఖాతాదారులకు ఏటీఎం కేంద్రాల్లో మోసాల నివారణకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
1. ఖాతాదారులు ఏటీఎం కేంద్రాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్న సమయంలో చుట్టుపక్కల పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. ఏటీఎం కార్డును మిషన్ లో సరిగా ఉంచామా? లేదా? అన్నది పరిశీలించాలని బ్యాంక్ సూచించింది. ఏపీఎం కేంద్రాల్లో ఏమైనా అనుమానాస్పద పరికరాలు ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. ఏటీఎం మిషన్ లో పిన్ నమోదు చేసే సమయంలో మీ కీబోర్డ్ ను చేతితో కవర్ చేసి ఉండాలి. ఎవరూ మీ పిన్ ను చూడకుండా జాగ్రత్త వహించాలని బ్యాంక్ సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. ఏటీఎం పిన్ ను కాలానుగుణంగా మార్చుతూ ఉండాలని బ్యాంక్ ఖాతాదారులకు సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. ఇంకా ఖాతా స్టేట్ మెంట్ ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని బ్యాంక్ సూచించింది.(ఫొటో: ట్విట్టర్)