దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి గుడ్ న్యూస్ చెప్పింది. బల్క్ డిపాజిట్ల(రూ.2 కోట్లుపైన)పై వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు ఎస్బీఐ ప్రకటించింది. కొత్త రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. తాజా సవరణల తర్వాత బల్క్ డిపాజిట్ల కోసం SBI FD వడ్డీ రేట్లను 40 నుంచి 90 బేసిస్ పాయింట్లను పెంచింది. (ప్రతీకాత్మక చిత్రం)
బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఈ టెన్యూర్‌లో 90 బేసిక్ పాయింట్స్ (bps) పెరుగుదలతో డిపాజిట్లపై వడ్డీ రేట్లను 3.60 శాతం నుండి 4.50 శాతానికి పెరిగాయి. సవరించిన వడ్డీ రేట్లు తాజాగా కొత్త డిపాజిట్లతో పాటు మెచ్యూర్ అయిన డిపాజిట్లను రెన్యువల్ చేసుకున్న వాటిపై కూడా వర్తిస్తాయని SBI తెలిపింది. దీంతో NRO టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, దేశీయ టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో సరిపోలనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఏడాది నుండి రెండేళ్ల కాలపరిమితిపై 3.60 శాతం నుండి 4.00 శాతానికి వడ్డీ రేట్లను పెంచింది. రెండేళ్ల నుండి మూడేళ్ల కాలపరిమితిపై 3.60 శాతం నుండి 4.25 శాతానికి, రెండేళ్ల నుండి అయిదేళ్ల కాలపరిమితి ఎఫ్డీలపై 3.60 శాతం నుండి 4.50 శాతానికి, అయిదేళ్ల నుండి పదేళ్ల కాలపరిమితిపై 3.60 శాతం నుండి 4.50 శాతానికి పెంచింది.