1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? అయితే మీరు రూ.20 లక్షల వరకు పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవచ్చు. తమ బ్యాంకులో సాలరీ అకౌంట్ ఉన్నవారి కోసం ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్ (SBI Quick Personal Loan) పేరుతో వెంటనే వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
2. కస్టమర్లు వ్యక్తిగత అవసరాలు, పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు తక్కువ వడ్డీకే రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు కూడా తక్కువ. https://www.sbiloansin59minutes.com/ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో రుణాలను మంజూరు చేస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, కార్పొరేట్ ఉద్యోగులు ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. కనీసం ఒక ఏడాది సర్వీసులో ఉండాలి. ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసే కస్టమర్ల వయస్సు 21 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. కనీసం రూ.24,000 నుంచి రూ.20,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్లో 1.50 శాతం చెల్లించాలి. కనీసం రూ.1,000 నుంచి రూ.15,000 + జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. రీపేమెంట్ కోసం 6 నెలల నుంచి 72 నెలల మధ్య గడువును ఎంచుకోవచ్చు. 10.85 శాతం నుంచి 12.85 శాతం మధ్య వడ్డీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ క్విక్ పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేయడానికి ముందుగా https://www.sbiloansin59minutes.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Personal Loan పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత apply now పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత పూర్తి పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీ వివరాలతో లాగిన్ చేసిన తర్వాత మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలన్నీ ఎంటర్ చేయాలి. మీరు ఎంత రుణానికి దరఖాస్తు చేస్తున్నారో, టెన్యూర్ ఎంతో సెలెక్ట్ చేయాలి. మీ వివరాలను విశ్లేషించి 15 నిమిషాల్లో ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)