1. బ్యాంకులు ఎవరి అవసరాలకు తగ్గట్టుగా వారికి ప్రత్యేకంగా క్రెడిట్ కార్డుల్ని రూపొందిస్తుంటాయి. షాపింగ్ ఎక్కువగా చేసేవారికి షాపింగ్ క్రెడిట్ కార్డులు (Shopping Credit Cards), ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ట్రావెల్ క్రెడిట్ కార్డులు, వ్యాపారాలు చేసేవారికి బిజినెస్ క్రెడిట్ కార్డులు... ఇలా వేర్వేరు వర్గాలకు వేర్వేరు క్రెడిట్ కార్డుల్ని ప్రత్యేకంగా అందిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇటీవల కాలంలో బ్యాంకులు హెల్త్ క్రెడిట్ కార్డుల్ని (Health Credit Cards) కూడా ఇస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి తర్వాత ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు హెల్త్ బెనిఫిట్స్ (Health Benefits) ఇచ్చే క్రెడిట్ కార్డుల్ని కస్టమర్లకు ఆఫర్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. SBI Pulse Credit Card: ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.1,499. ఈ కార్డు తీసుకున్నవారికి నెట్‌మెడ్స్ మెంబర్షిప్ లభిస్తుంది. డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్, బేసిక్ హెల్త్ చెకప్ చేయించుకోవచ్చు. ఫార్మసీలో చెల్లింపులకు 5 రెట్లు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ప్యాథాలజీ ల్యాబ్ టెస్టులతో పాటు ఇతర చెల్లిపులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. నెలకు 3.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Apollo SBI Credit Card: అపోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.499. ఈ కార్డుతో అపోలో సేవలకు రూ.100 ఖర్చు చేస్తే మూడు రెట్లు ఎక్కువగా రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. దీంతో పాటు అపోలో సేవలు అన్నింటికీ 10 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. నెలకు 3.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. Axis Bank Aura Credit Card: యాక్సిస్ బ్యాంక్ ఆరా క్రెడిట్ కార్డుకు యాన్యువల్ ఫీజు రూ.749. ఈ కార్డు ఉన్నవారికి ప్రాక్టో ద్వారా డాక్టర్ వీడియో కన్సల్టేషన్స్ ఉచితం. హెల్త్ చెకప్ చేయిస్తే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇన్స్యూరెన్స్‌కు సంబంధించిన చెల్లింపులపై ప్రతీ రూ.200 కి ఐదు రెట్లు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. నెలకు 3.40 శాతం వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. Yes Bank Wellness Credit Card: యెస్ బ్యాంక్ వెల్నెస్ క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు రూ.1,999. ఈ కార్డు ఉన్నవారికి యాన్యువల్ ప్రివెంటీవ్ హెల్త్ చెకప్ ఉచితం. దీంతో పాటు డాక్టర్‌తో వీడియో కన్సల్టేషన్ లభిస్తుంది. ఫార్మసీ స్టోర్‌తో పాటు ఇతర చెల్లింపులకు ప్రతీ రూ.200 పై 20 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. నెలకు 3.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)