SBI OTP BASED CASH WITHDRAWAL SYSTEM KNOW HOW TO WITHDRAW AMOUNT FROM STATE BANK OF INDIA ATMS WITH OTP SS
SBI: రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలా? ఓటీపీతో చేయండి ఇలా
SBI OTP based Cash Withdrawal | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే పద్ధతిని కాస్త మార్చింది బ్యాంకు. కస్టమర్లు కార్డు మోసాలకు పాల్పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. మరి డబ్బులు ఎలా డ్రా చేయాలో తెలుసుకోండి.
1. మీరు ఎక్కువగా ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తుంటారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఏటీఎంకు ఎక్కువగా వెళ్తుంటారా? రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
2. మీరు రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. ఎస్బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఈ ఏడాది జనవరి 1న ప్రారంభించింది. ఎస్బీఐకి చెందిన అన్ని ఏటీఎంలల్లో ఈ సెక్యూరిటీ ఫీచర్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
3. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఎవరైనా రూ.10,000 కన్నా ఎక్కువ డబ్బులు డ్రా చేయాలంటే తప్పనిసరిగా ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే. అయితే ఇప్పటికీ ఈ సెక్యూరిటీ ఫీచర్‌పై ఎస్బీఐ ఖాతాదారులకు అవగాహన తక్కువే. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
4. ఎస్బీఐ ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్‌ను ఎలా ఉపయోగించాలంటే ముందుగా ఏటీఎంలో మీ కార్డు స్వైప్ చేయాలి. రూ.10,000 లోపు ఓటీపీ అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
5. రూ.10,000 కన్నా ఎక్కువ అమౌంట్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఏటీఎం స్క్రీన్ పైన ఓటీపీ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
6. మీరు సరైన ఓటీపీ ఎంటర్ చేస్తేనే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా అవుతాయి. కార్డు మోసాలను తగ్గించేందుకు తగ్గించేందుకు అదనంగా ఆథెంటిఫికేషన్ ప్యాక్టర్‌ను యాడ్ చేసింది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
7. ఒకవేళ కార్డు పోగొట్టుకున్నా మీ కార్డుతో ఎవరైనా డబ్బులు డ్రా చేయడానికి ట్రై చేస్తే మీ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అయితే రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకే ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ పనిచేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)