SBI Schemes: ఎస్బీఐ టాప్ 5 స్కీమ్స్.. రూ.లక్షకు రూ.10 లక్షల లాభం!
SBI Schemes: ఎస్బీఐ టాప్ 5 స్కీమ్స్.. రూ.లక్షకు రూ.10 లక్షల లాభం!
Investment | ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ పలు రకాల పథకాలు అందిస్తోంది. వీటిల్లో టాప్ 5 బెస్ట్ స్కీమ్స్ ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కీమ్స్ రూ.లక్షను రూ.10 లక్షలుగా మార్చాయి.
Mutual Funds | సేవింగ్ స్కీమ్స్ విషయానికి వస్తే.. చాలా మంది దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న ఎస్బీఐలో ఫిక్స్డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్ రూపంలో డబ్బులు పెడుతూ ఉంటారు. లేదంటే బ్యాంక్ అందించే ఇతర పథకాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉండొచ్చు.
2/ 9
అయితే స్టేట్ బ్యాంక్‌కు చెందిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ కూడా ప్రజలకు చాలా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. పలు రకాల స్కీమ్స్‌ను అందిస్తోంది. దీర్ఘకాల లక్ష్యంతో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారికి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ పలు రకాల స్కీమ్స్ అందిస్తోంది.
3/ 9
ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా లేదంటే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. సంస్థ అందిస్తున్న స్కీమ్స్‌లో టాప్ 5 పథకాలు ఏంటివో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. వీటిల్లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీమ్ తొలి స్థానంలో ఉంది.
4/ 9
ఇది పదేళ్ల కాలంలో 25 శాతం సీఏజీఆర్ రాబడిని ఇచ్చింది. అంటే మీరు మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ. 9.57 లక్షలు వచ్చేవి. అదే మీరు నెలకు రూ. 5 వేలకు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే ఇప్పుడు రూ.20 లక్షలకు పైగా లభించేవి.
5/ 9
అలాగే ఎస్బీఐ మ్యాగ్నమ్ మిడ్ క్యాప్ ఫండ్ కూడా ఒకటి ది. ఈ ఫండ్ పదేళ్ల సీఏజీఆర్ రాబడి 21 శాతంగా ఉంది. అంటే రూ.లక్ష పెట్టిన వాళ్లకు రూ. 6.47 లక్షలు లభించేవి. అదే రూ. 5 వేల సిప్ చేస్తూ వచ్చి ఉంటే రూ. 15 లక్షలకు పైగా వచ్చేవి.
6/ 9
ఇంకా ఎస్బీఐ టెక్ ఆపర్చునిటీస్ ఫండ్ కూడా ఉంది. ఈ ఫండ్ పదేళ్ల సీఏజీఆర్ 20 శాతంగా ఉంది. అంటే మీరు రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ. 6.5 లక్షలు వచ్చేవి. అదే సిప్ ఆప్షన్ ఎంచుకొని రూ. 5 వేలు పెడుతూ వచ్చి ఉంటే.. ఇప్పుడు రూ. 16 లక్షలు లభించేవి.
7/ 9
ఎస్బీఐ మ్యాగ్నమ్ గ్లోబల్ ఫండ్ కూడా ఒకటి ఉంది. ఈ ఫండ్ పదేళ్ల సీఏజీఆర్ 17 శాతం. అంటే మీరు ఈ ఫండ్‌లో పదేళ్ల కిందట రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు రూ. 4.86 లక్షలు లభించేవి. అదే రూ. 5 వేలు సిప్ చేస్తూ వచ్చి ఉంటే రూ. 12.8 లక్షలు వచ్చేవి.
8/ 9
ఇంకా ఎస్బీఐ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ ఉంది. ఈ ఫండ్ పదేళ్ల సీఏజీఆర్ 17 శాతం. అంటే మీరు ఈ ఫండ్‌లో పదేళ్ల కిందట రూ. లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు రూ. 4.6 లక్షలు వచ్చేవి. అదే రూ. 5 వేలు సిప్ చేస్తూ ఉంటే.. రూ. 13 లక్షలు లభించేవి.
9/ 9
గత పదేళ్లలో చూస్తే.. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్‌లో ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అధిక రాబడిని ఇచ్చింది. పదేళ్లలో దీని సీఏజీఆర్ 25 శాతంగా ఉంది. రూ.5 వేల సిప్ చేసిన వారికి రూ. 20 లక్షలు, ఒకేసారి రూ.లక్ష పెట్టినోళ్లకు రూ.9.57 లక్షలు లభించేవి.