1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకున్నారా? పర్సనల్ లోన్ తీసుకొని ఈఎంఐలు చెల్లిస్తున్నారా? ఎస్బీఐ లోన్ రీస్ట్రక్చరింగ్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసింది. మరి మీ లోన్ పునర్నిర్మించుకోవడానికి, మీ ఈఎంఐ భారం తగ్గించడానికి ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. రీటైల్ కస్టమర్లు 1 నెల నుంచి 24 నెలల మారటోరియం ఎంచుకోవచ్చు. హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్, పర్సనల్ లోన్, ఆటో లోన్లకు ఇది వర్తిస్తుంది. ఇతర కస్టమర్ల కన్నా 0.35% శాతం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తుంది ఎస్బీఐ. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 24 చివరి తేదీ. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అయితే మీకు మారటోరియం ఇవ్వాలా వద్దా అన్న తుది నిర్ణయం బ్యాంకుదే. 7 నుంచి 10 వర్కింగ్ డేస్లో మీ దరఖాస్తు ప్రాసెస్ అవుతుంది. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ ఫిబ్రవరి సాలరీ స్లిప్, లేటెస్ట్ సాలరీ స్లిప్, ఉద్యోగం కోల్పోతే అందుకు సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అంటే 2020 ఫిబ్రవరితో పోలిస్తే 2020 ఆగస్ట్ నాటికి మీ వేతనం లేదా ఆదాయం తగ్గితే, వ్యాపారాలు మూతపడితే, అందుకు కరోనా వైరస్ మహమ్మారి కారణం అయితే మీరు మీ రుణాలను పునర్నిర్మించుకోవచ్చు. ఉద్యోగులు, వ్యాపారులు తాము కోవిడ్ 19 కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు డిక్లరేషన్ ఇవ్వాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మీకు ఎన్ని లోన్ అకౌంట్లు ఉంటే వాటిపై మారటోరియం ఎంచుకోవచ్చు. మీరు గరిష్టంగా 24 నెలలు అంటే రెండేళ్లు మారటోరియం ఎంచుకోవచ్చు. గతంలో బ్యాంకులు ఇచ్చిన 6 నెలల మారటోరియం కన్నా ఇది అదనం. మారటోరియం కాలంలో మీరు ఎలాంటి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే మారటోరియం సందర్భంలో వడ్డీ కూడా లెక్కిస్తుంది బ్యాంకు. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఒకవేళ మారటోరియం కాలంలో మీ దగ్గర డబ్బు ఉంటే మీరు ఈఎంఐలు చెల్లించి వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు. మీరు మారటోరియం ఎంచుకుంటారు కాబట్టి ఈఎంఐలో మార్పు ఉంటుంది. మారటోరియం కాలాన్ని లెక్కించి బ్యాంకు ఈఎంఐను నిర్ణయిస్తుంది. మీరు మారటోరియం ఎంచుకుంటే ఇతర రుణాలకు అప్లై చేయడానికి అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)