1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. అసలు డెబిట్ కార్డులపై యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ (Insurance) సదుపాయం ఉందన్న విషయం చాలామందికి తెలియదు. దాదాపు ప్రతీ డెబిట్ కార్డుపైన ఈ ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అయితే ఇన్స్యూరెన్స్ ఎంత ఉంటుందన్నది డెబిట్ కార్డు టైప్ పైన ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. వేర్వేరు కార్డులకు వేర్వురుగా ఇన్స్యూరెన్స్ మొత్తం ఉంటుంది. డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నవారికి మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్ లభిస్తుంది. డెబిట్ కార్డ్ ఉంటే సరిపోదు. ఆ కార్డును ఏటీఎం, పీఓఎస్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో గత 90 రోజుల్లో వాడాలన్న నిబంధన ఉంటుంది. అంటే ఇన్స్యూరెన్స్ యాక్టీవ్‌గా ఉండాలంటే డెబిట్ కార్డును తరచూ వాడుతూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
12. ఇక ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఎస్బీఐ డెబిట్ కార్డులకు రూ.2,00,000 వరకు బీమా వర్తిస్తుంది. 2018 ఆగస్ట్ 28 కన్నా ముందు తీసుకున్నవారికి రూ.1,00,000 వర్తిస్తే, 2018 ఆగస్ట్ 28 తర్వాత డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2,00,000 బీమా వర్తిస్తుంది. యాక్సిడెంట్ జరిగిన 90 రోజుల ముందు ఆ కార్డుతో ట్రాన్సాక్షన్ చేసి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)