1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. ఎస్బీఐ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS) లావాదేవీల లిమిట్‌ను పెంచింది. గతంలో గరిష్టంగా రూ.2,00,000 మాత్రమే ఐఎంపీఎస్ ద్వారా పంపే అవకాశం ఉండేది. కానీ ఈ లిమిట్‌ను రూ.5,00,000 వరకు పెంచింది. ఆన్లైన్ పద్ధతిలో ఈ లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు కూడా ఉండవని ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో ప్లాట్‌ఫామ్స్ ద్వారా రూ.5,00,000 వరకు ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఆఫ్‌లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్బీఐ ప్రకటించిన కొత్త ఐఎంపీఎస్ శ్లాబ్ 2022 ఫిబ్రవరి 1 నుంచి అమలులోకి రానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. పాత శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఆఫ్‌లైన్‌లో ఐఎంపీఎస్ మనీ ట్రాన్సాక్షన్స్లో 5 శ్లాబ్స్ ఉన్నాయి. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే గరిష్టంగా రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. మరి ఆఫ్‌లైన్ ఐఎంపీఎస్ ట్రాన్సాక్షన్‌కు ఏ శ్లాబ్‌లో ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ ఐఎంపీఎస్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.1,000 వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. రూ.1,000 నుంచి రూ.10,000 వరకు రూ.2 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రూ.4 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు రూ.12 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు రూ.20 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎస్బీఐ కస్టమర్లు ఐఎంపీఎస్‌తో పాటు నెఫ్ట్, ఆర్టీజీఎస్ ద్వారా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. వెంటనే అవతలివారి అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఐఎంపీఎస్ సర్వీస్ ఉపయోగపడుతుంది. నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాచ్‌ల వారీగా ట్రాన్సాక్షన్స్ సెటిల్మెంట్ పూర్తవుతుంది. ఇక ఆర్టీజీఎస్ సర్వీస్ భారీ మొత్తంలో డబ్బులు పంపడానికి ఉపయోగపడుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎస్బీఐ నెఫ్ట్ ఛార్జీల వివరాలు చూస్తే ఐఎంపీఎస్ లాగానే నెఫ్ట్ ద్వారా ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా రూ.2,00,000 వరకు మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఛార్జీలు ఉండవు. ఆఫ్‌లైన్ పద్ధతిలో నెఫ్ట్ ట్రాన్సాక్షన్ చేస్తేనే ఛార్జీలు చెల్లించాలి. నెఫ్ట్ ఛార్జీల వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. నెఫ్ట్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.10,000 వరకు రూ.2 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ, రూ.10,000 నుంచి రూ.1,00,000 వరకు రూ.4 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ, రూ.1,00,000 నుంచి రూ.2,00,000 వరకు రూ.12 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ, రూ.2,00,000 కన్నా ఎక్కువ అయితే రూ.20 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎస్బీఐ ఆర్టీజీఎస్ ఛార్జీల వివరాలు చూస్తే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా ఆర్టీజీఎస్ లావాదేవీలు జరిపితే ఎలాంటి ఛార్జీలు ఉండవు. మరి ఆఫ్‌లైన్ పద్ధతిలో ఆర్టీజీఎస్ ఛార్జీల వివరాలు చూస్తే రూ.2,00,000 నుంచి రూ.5,00,000 వరకు- రూ.20 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ, రూ.5,00,000 కన్నా ఎక్కువ అయితే రూ.40 సర్వీస్ ఛార్జీ + జీఎస్టీ చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)