ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (MCLR)ని 10 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. కొత్త రేట్లు మే 15 నుంచి అమలులోకి వచ్చాయి. గడిచిన నెల కాలంలో ఎస్బీఐ ఎంసీఎల్ఆర్ రేట్లు పెంచడం ఇది రెండో సారి. ఈ రేట్ల పెంపు తర్వాత హోమ్ లోన్లు, పర్సనల్ లోన్ల నెలవారీ వాయిదాలు (ఈఎంఐలు) మరింత పెరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
MCLR రేట్ల తాజా పెరుగుదల తరువాత ఎస్బీఐ ఓవర్ నైట్, వన్-మంత్ (One-month), మూడు నెలల (Three-month) ఎంసీఎల్ఆర్ రేటు ఇప్పుడు 6.85 శాతంగా ఉంది. అంతకుముందు ఇది 6.75 శాతంగా ఉంది. ఆరు నెలల (Six-month) ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 7.05 శాతం నుంచి 7.15 శాతానికి పెరిగింది. అదే విధంగా ఒక ఏడాదికి ఎంసీఎల్ఆర్ 7.10 శాతం నుంచి 7.2 శాతానికి చేరుకుంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది. మూడేళ్ల కాలపరిమితికి రుణ రేటు 7.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
* MCLR అంటే ఏంటి ?
ఆర్బీఐ 2016లో ప్రవేశపెట్టిన MCLR అనేది పోటీతత్వ, పారదర్శక రేటుతో రుణాలను అందించడానికి బ్యాంకులకు ఉపయోగపడే ఇంటర్నల్ ఇండెక్స్ వడ్డీ రేటు. సింపుల్గా చెప్పాలంటే, ఎంసీఎల్ఆర్ అనేది బ్యాంకులు తమ కస్టమర్లకు రుణాలుపై ఇచ్చే కనీస వడ్డీ రేటు. దీనిని సాధారణంగా రుణ కాల వ్యవధి లేదా రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించాల్సిన సమయం ఆధారంగా లెక్కిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
MCLR రేట్లను నిర్ణయించేటప్పుడు బ్యాంకులు నగదు నిల్వల నిష్పత్తి (Cash Reserve Ratio), నిధుల మార్జినల్ కాస్ట్ (Marginal Cost Of Funds), అవధి ప్రీమియంలు (Tenor Premiums), బ్యాంక్ నిర్వహణ ఖర్చుల (Operational Cost Of The Bank)ను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. బ్యాంకులు సాధారణంగా నెలవారీ ప్రాతిపదికన MCLRను సమీక్షిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
* బ్యాంకులు MCLRను ఎందుకు పెంచుతున్నాయి?
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ ఇటీవల రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు లేదా 4.40 శాతం పెంచింది. రెపో రేటు పెరుగుదల తర్వాత, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు తమ MCLRను పెంచుతున్నాయి. ఆర్బీఐ అధికారిక ప్రకటనకు ముందే రెపో రేటు పెంపును ఊహించి రుణదాతలు ఎంసీఎల్ఆర్ని పెంచడం ప్రారంభించారు. రెపో రేటు పెంపు కారణంగా ఎంసీఎల్ఆర్ మరింత పెరుగుతూనే ఉంటుంది.
(ప్రతీకాత్మక చిత్రం)