బీపీఎల్ఆర్ అనేది ఇంటర్నల్ బెంచ్‌మార్క్ రేటు. బ్యాంకులు ఈ రేటు ప్రాతిపదికన హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయని చెప్పుకోవచ్చు. అంటే బీపీఎల్ఆర్ పెరిగితే అందుకు అనుగుణంగా హోమ్ లోన్స్ వడ్డీ రేట్లు కూడా పైకి చేరొచ్చు. బీపీఎల్ఆర్ విధానంలో పారదర్శకత లేకపోవడంతో ఆర్బీఐ 2010లో బీపీఎల్ఆర్ స్థానంలో బేస్ రేటు సిస్టమ్‌ను తెచ్చింది.