1. కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక సంక్షోభాన్ని (Financial Crisis) సృష్టించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని వర్గాలవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి బంగారాన్ని తాకట్టు (Gold Loan) పెడుతున్నారు. దీంతో గోల్డ్ లోన్ తీసుకునేవారి సంఖ్య పెరిగిపోయింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గోల్డ్ లోన్ తీసుకునేవారికి బ్యాంకులు లాభదాయకమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లపై డిస్కౌంట్ ప్రకటిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) గోల్డ్ లోన్ వడ్డీ రేటుపై డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణంగా బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థల్లో గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లు 7 శాతం నుంచి 29 శాతం మధ్య ఉంటాయి. ఎస్బీఐలో గోల్డ్ లోన్‌పై ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ రేటు ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. యోనో ఎస్బీఐ ప్లాట్‌ఫామ్ ద్వారా గోల్డ్ లోన్‌కు దరఖాస్తు చేస్తే 0.75 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ ఆఫర్ 2021 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆఫర్ ఉంది. కేవలం 4 స్టెప్స్‌లో గోల్డ్ లోన్‌కు అప్లై చేయొచ్చు. మరి యోనో ఎస్బీఐ వెబ్సైట్ లేదా యాప్‌లో పసిడి రుణాలకు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)