క్రెడిట్ స్కోర్ బాగున్న వారికి తక్కువ వడ్డీకి రుణాలు లభించొచ్చు. రెగ్యులర్ హోమ్ లోన్స్ విషయానకి వస్తే.. 800 లేదా ఆపైన క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి 8.4 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయి. 750 నుంచి 799 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే 25 బేసిస్ పాయింట్లు రాయితీ వస్తుంది. వీరికి వడ్డీ రేటు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే 700 నుంచి 749 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే.. వారికి వడ్డీ రేటు 8.55 శాతం నుంచి ప్రారంభం అవుతుంది.
ఇక టాప్ అప్ లోన్స్ విషయానికి వస్తే.. ఎస్బీఐ 15 బేసిస్ పాయింట్లు తగ్గింపు అందిస్తోంది. 700 నుంచి 800 మధ్యలో సిబిల్ స్కోర్ ఉన్న వారికి ఇది వర్తిస్తుంది. 800 లేదా ఆపైన సిబిల్ స్కోర్ ఉంటే వారికి 8.8 శాతం వడ్డీకే రుణం లభిస్తుంది. 750 నుంచి 799 మధ్యలో సిబిల్ స్కోర్ ఉంటే 8.9 శాతం వడ్డీ పడుతుంది. ఇక 700 నుంచి 749 మధ్యలో క్రెడిట్ స్కోర్ ఉంటే 9.15 శాతం వడ్డీ చెల్లించాలి. ఇంకా సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ పడుతుంది.
హోమ్ లోన్ అగెనెస్ట్ ప్రాపర్టీ లోన్ కూడా పొందొచ్చు. ఈ రుణాలపై 30 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేటు రాయితీ లభిస్తోంది. 800 లేదా ఆపై క్రెడిట్ స్కోర్ ఉంటే 10 శాతం వడ్డీ పడుతుంది. 750 నుంచి 799 మధ్యలో స్కోర్ ఉంటే 10.10 శాతం వడ్డీతో లోన్ పొందొచ్చు. 700 నుంచి 749 వరకు మధ్యలో స్కోర్ ఉంటే వడ్డీ రేటు 10.20 శాతంగా ఉంటుంది. ఇంకా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటే ఎక్కువ వడ్డీ చెల్లించాలి.