1. టూవీలర్ కొనాలనుకునేవారికి శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 'ఎస్బీఐ ఈజీ రైడ్' పేరుతో ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ ప్రకటించింది. కస్టమర్లు ఈ స్కీమ్ ద్వారా వెహికిల్ లోన్‌కు (Vehicle Loan) దరఖాస్తు చేయొచ్చు. కనీసం రూ.20,000 నుంచి గరిష్టంగా రూ.3,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. వార్షిక వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉదాహరణకు మీరు కొనాలనుకున్న వాహనం ఆన్ రోడ్ ధర రూ.1,00,000 ఉంటే రూ.85,000 వరకు లోన్ వస్తుంది. మిగతా మొత్తాన్ని డౌన్ పేమెంట్‌గా చెల్లించాలి. 'ఎస్బీఐ ఈజీ రైడ్' వెహికిల్ స్కీమ్ ద్వారా వాహన రుణం పొందడానికి కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. యోనో యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)
4. నాలుగేళ్ల టెన్యూర్‌తో రూ.3,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. ఇక ఈఎంఐ విషయానికి వస్తే రూ.1 లక్షకు కేవలం రూ.2,560 ఈఎంఐ చెల్లిస్తే చాలని ఎస్బీఐ చెబుతోంది. లోన్ నేరుగా డీలర్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. మరి ఎస్బీఐ కస్టమర్లు 'ఎస్బీఐ ఈజీ రైడ్' వెహికిల్ లోన్‌కు ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇది ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్ కాబట్టి అందరికీ ఈ ఆఫర్ వర్తించదు. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తించేవారికి ఎస్బీఐ నుంచి ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ వస్తుంది. లేదా కస్టమర్లు తమ యోనో ఎస్బీఐ యాప్‌లో చెక్ చేయొచ్చు. యోనో ఎస్బీఐ యాప్‌లో ప్రీఅప్రూవ్డ్ పర్సనల్ లోన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. గోల్డ్ లోన్, కార్ లోన్ లాంటి ఆఫర్స్ కూడా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)