1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు అలర్ట్. ఎస్బీఐ మరింత సులభంగా బ్యాంకింగ్ సేవల్ని అందిస్తోంది. గతంలో బ్యాంకింగ్ సేవలు (Banking Services) పొందాలంటే ఖాతాదారులు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని అనేక సేవల్ని ఆన్లైన్లోనే అందిస్తున్నాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొన్ని సేవలకు అసలు బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో నుంచే బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్ కూడా అవసరం లేదు. ఫీచర్ ఫోన్ ఉన్నా చాలు. పలు రకాల బ్యాంకింగ్ సేవలు లభిస్తాయి. ఎస్బీఐ తమ కస్టమర్లకు మరిన్ని మెరుగైన సేవల్ని సులభంగా అందించేందుకు ఇటీవల కాంటాక్ట్ సెంటర్ సర్వీస్‌ను అప్‌గ్రేడ్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ అప్‌గ్రేడ్ చేసిన కాంటాక్ట్ సెంటర్‌తో 30 పైగా బ్యాంకింగ్ సేవల్ని ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పొందొచ్చు. 12 భాషల్లో ఈ సేవలు లభిస్తాయి. 24 గంటల పాటు ఈ సేవలు పొందొచ్చు. ఇందుకోసం రెండు టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసింది ఎస్బీఐ. 1800-1234 లేదా 1800-2100 నెంబర్లకు కాల్ చేసి కస్టమర్లు బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డ్, చెక్ బుక్, ఎమర్జెన్సీ సర్వీసెస్, డిజిటల్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన సమాచారం... ఇలా అనేక రకాల సేవలు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పొందొచ్చు. ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్ ద్వారా ప్రధానంగా లభించే సేవల్ని చూస్తే కస్టమర్లు సులువుగా అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. దీంతో పాటు గత 5 లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ చెక్ చేయొచ్చు. ఇక ఏటీఎం కార్డ్ ఎవరైనా దొంగిలించినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా సులువుగా బ్లాక్ చేయొచ్చు. కొత్త కార్డుకు రిక్వెస్ట్ చేయొచ్చు. కొత్త కార్డ్ ఎప్పట్లోగా తమ అడ్రస్‌కు వస్తుందో డిస్పాచ్ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. చెక్ బుక్ కోసం బ్యాంకులో లేదా యాప్‌లో రిక్వెస్ట్ చేసినట్టైతే చెక్ బుక్ డిస్పాచ్ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు. టీడీఎస్ వివరాలు, డిపాజిట్ ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ లాంటివి ఇమెయిల్ ద్వారా పొందొచ్చు. కాంటాక్ట్ సెంటర్ ద్వారా ఎస్బీఐ అందిస్తున్న 30 పైగా సేవల్లో ఇవి కొన్ని మాత్రమే. కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తమకు కావాల్సిన సేవల్ని పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎస్బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు ప్రతీ నెలా కోటిన్నరకు పైగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని అంచనా. అందులో 40 శాతం ఐవీఆర్ ద్వారా కస్టమర్లు సేవలు పొందుతున్నారు. మరిన్ని వివరాల కోసం కస్టమర్ కేర్ ప్రతినిధుల్ని సంప్రదిస్తున్నారు. ఎస్బీఐ కస్టమర్లకు సేవలు అందించేందుకు 3500 పైగా టెలీ కాలర్ ప్రతినిధులు అందుబాటులో ఉండటం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)