లేదంటే ఎస్బీఐ కార్డు మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు రివార్డు పాయింట్లను రిడీమ్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత రివార్డ్స్ పై క్లిక్ చేయాలి. తర్వాత రిడీమ్ రివార్డ్స్‌పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు నచ్చిన ఐటమ్ ఎంచుకోవాలి. రిడీమ్‌పై క్లిక్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ చేయాలి.
మరోవైపు ఎస్బీఐ కార్డు ఇటీవలనే రెంట్ పేమెంట్లపై ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తోంది. రూ. 99తో పాటు జీఎస్టీ విధిస్తోంది. నవంబర్ 15 నుంచి ఈ చార్జీలు అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈఎంఐ లావాదేవీలపై ప్రాసెసింగ్ ఫీజు పెంచేసింది. రూ. 99 నుంచి రూ. 199కు చేర్చింది. కాగా ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కూడా ఇటీవల చార్జీలను సవరించాయి. హెచ్డీఎఫ్సీ రివార్డు ప్రోగ్రామ్‌ను సవరించింది.