1. మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్రెడిట్ కార్డ్ ప్లాట్‌ఫామ్ అయిన ఎస్బీఐ కార్డ్ (SBI Card). సరికొత్త క్రెడిట్ కార్డును లాంఛ్ చేసింది. ఫిట్నెస్, హెల్త్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని ఎస్బీఐ కార్డ్ పల్స్ (SBI Card PULSE) పేరుతో ఈ కొత్త క్రెడిట్ కార్డును పరిచయం చేసింది. ఈ క్రెడిట్ కార్డుతో ఫిట్నెస్, హెల్త్ సంబంధిత బెనిఫిట్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డు తీసుకోవడానికి యాన్యువల్ ఫీజు రూ.1,499 చెల్లించాలి. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లభిస్తుంది. ఒక ఏడాదిలో రూ.2,00,000 కన్నా ఎక్కువ ఖర్చు చేసేవారికి రెన్యువల్ ఫీజు ఉండదు. రూ.4,00,000 ఖర్చు చేస్తే రూ.1500 విలువైన ఇ-వోచర్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎస్బీఐ కార్డ్ పల్స్ క్రెడిట్ కార్డ్ తీసుకునేవారికి వెల్కమ్ గిఫ్ట్ కింద నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్ ఉచితంగా లభిస్తుంది. నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌లో 1.4 అంగుళాల కలర్ డిస్ప్లే ఉంది. ఇందులో బ్లడ్ ఆక్సిజన్ మానిటరింగ్ (SPO2), స్లీప్ మానిటరింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌వాచ్‌తో పాటు ఫిట్‌పాస్ ప్రో ఏడాది మెంబర్షిప్ ఉచితంగా లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ కార్డ్ పల్స్ కస్టమర్లు దేశంలోని 4,000 పైగా జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లకు యాక్సెస్ లభిస్తుంది. వారానికి మూడు సెషన్ల చొప్పున నెలకు 12 సెషన్ల వరకు ఉచితంగా అటెండ్ కావొచ్చు.జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లలో యాక్సెస్‌తో పాటు యోగా, డ్యాన్స్, కార్డియో లాంటి వ్యాయామాలు చేయాలనుకునేవారికి అన్లిమిటెడ్ ఆన్లైన్ ఫిట్నెస్ సెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐ కార్డ్ పల్స్ కస్టమర్లు దేశంలోని 4,000 పైగా జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లకు యాక్సెస్ లభిస్తుంది. వారానికి మూడు సెషన్ల చొప్పున నెలకు 12 సెషన్ల వరకు ఉచితంగా అటెండ్ కావొచ్చు.జిమ్స్, ఫిట్నెస్ సెంటర్లలో యాక్సెస్‌తో పాటు యోగా, డ్యాన్స్, కార్డియో లాంటి వ్యాయామాలు చేయాలనుకునేవారికి అన్లిమిటెడ్ ఆన్లైన్ ఫిట్నెస్ సెక్షన్స్ ఉచితంగా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. నెట్‌మెడ్స్ నుంచి 2.5 శాతం ఎన్ఎంఎస్ క్యాష్ రూ.100 వరకు లభిస్తుంది. ప్యాథాలజీ ల్యాబ్ టెస్టులపై 5 శాతం తగ్గింపు లభిస్తుంది. మెడిసిన్ కొనేవారికి అన్లిమిటెడ్ డెలివరీ ఉచితం. ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డుతో మెడికల్ షాప్స్, డైనింగ్, మూవీస్ కోసం ఖర్చు చేస్తే ప్రతీ రూ.100 కు 10 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇతర లావాదేవీలకు ప్రతీ రూ.100 ట్రాన్సాక్షన్‌పై 2 రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. ఈ కార్డుపై ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఫ్రాడ్ లయబిలిటీ ఇన్స్యూరెన్స్ కవర్ రూ.1,00,000 వరకు, ఎయిర్ యాక్సిడెంట్ కవర్ రూ.50,00,000వరకు లభిస్తుంది. ఏడా 8 సార్లు డొమెస్టిక్ లాంజ్ విజిట్స్ కాంప్లిమెంటరీగా లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)