ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి ఎస్బిఐ గ్రీన్ కార్ లోన్ ఇస్తోంది. ఈ రుణం చాలా ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందకు వచ్చింది. 21 మరియు 67 సంవత్సరాల మధ్య ఉన్నవారు మాత్రమే గ్రీన్ కార్ లోన్ పొందవచ్చు. ఈ రుణం తిరిగి చెల్లించడానికి మూడు నుండి 8 సంవత్సరాలు కాలవ్యవధి నిర్ణయించనున్నారు. వాహనం ఆన్ రోడ్ ధరలో 90 శాతం వరకు మీరు రుణం పొందవచ్చు.
ఇక నాన్ సాలరీడ్ విభాగంలో వృత్తి నిపుణులు, సెల్ప్ ఫైనాన్స్, వ్యాపారవేత్తలు పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయంలో 4 రెట్లు వరకు రుణాలు పొందవచ్చు. ఏటా కనీసం 3 లక్షల ఆదాయం పొందడం అవసరం. వ్యవసాయ పనులలో నిమగ్నమైన వ్యక్తి ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి వారి వార్షిక ఆదాయానికి మూడు రెట్లు రుణం పొందవచ్చు. ఇందుకోసం 4 లక్షలకు పైగా ఆదాయం ఉండాలన్న షరతు విధించారు.