1. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మినిమమ్ బ్యాలెన్స్ ఎంత అని అడుగుతుంటారు కస్టమర్లు. బ్యాంకులో ఏ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా మినిమమ్ బ్యాలెన్స్ తప్పనిసరి. మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. ఏ బ్యాంకు అయినా ప్రతీ అకౌంట్‌కు మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో నిర్ణయిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే కస్టమర్ల నుంచి ఛార్జీలు వసూలు చేస్తుంది. అయితే ప్రతీ బ్యాంకులో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్ ఒకటి ఉంటుంది. ఆ అకౌంట్‌నే బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్-BSBD అంటారు. లేదా జీరో బ్యాలెన్స్ అకౌంట్ అని పిలుస్తారు. అంటే ఎలాంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేని అకౌంట్ అని అర్థం. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు వర్తించినట్టుగానే జీరో బ్యాలెన్స్ అకౌంట్‌కు వడ్డీ ఉంటుంది. రూ.1,00,000 కన్నా ఎక్కువ డిపాజిట్లపై వార్షికంగా 2.70 శాతం పైనే వడ్డీ లభిస్తుంది. అన్ని ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇందుకోసం బ్యాంకుకు వెళ్లి, బేసిక్ సేవింగ్స్ డిపాజిట్ అకౌంట్-BSBD ఫామ్ పూర్తి చేసి, కేవైసీ పూర్తి చేస్తే చాలు. (ప్రతీకాత్మక చిత్రం)