సేవింగ్స్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్వారా మీరు ఎంత వడ్డీ రేటును ఆర్జించారో డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవచ్చు. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించడం ద్వారా గానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ ఈ సర్టిఫికేట్ను పొందవచ్చు.