1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు అలర్ట్. బేసిక్ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లకు 2021 జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. క్యాష్ విత్‌డ్రాయల్, చెక్ బుక్ ఛార్జీల్లో మార్పులు రానున్నాయి. ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్లకు ఈ కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇక 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్బీఐ, నాన్ ఎస్బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్-BSBD అకౌంట్ హోల్డర్ల జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)