2. 2020-21 ఆర్థిక సంవత్సరంలో అంటే 9 నెలల్లో ఎస్బీఐ ద్వారా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరినవారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాలా 15 లక్షలు. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ-PFRDA లెక్కల ప్రకారం 9 నెలల్లో 52 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరితే అందులో 15 లక్షల మంది ఎస్బీఐ ద్వారా ఈ పథకంలో చేరడం విశేషం. ఇక ఇప్పటివరకు ఈ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య 2.75 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
3. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఈ స్కీమ్‌లో చేరిన వారి సంఖ్య భారీగా పెరిగిందని ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, పోస్ట్ ఆఫీసులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, డిస్ట్రిక్ట్ కోఆపరేటీవ్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, అర్బన్ కోఆపరేటీవ్ బ్యాంకుల ద్వారా ఈ పథకంలో చేరొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఎస్బీఐకి కస్టమర్ల సంఖ్య ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఈ బ్యాంకు ద్వారానే అటల్ పెన్షన్ యోజన-APY స్కీమ్‌లో చేరుతుండటం విశేషం. మీరు ఎస్బీఐ ద్వారా అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలనుకుంటే యాక్టీవ్‌లో ఉన్న అకౌంట్ ఉండాలి. దీంతో పాటు కేవైసీ వివరాలు అప్డేట్ చేసి ఉండాలి. మీరు కూడా ఎస్బీఐ కస్టమర్ అయితే అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేసిన తర్వాత నామినీ వివరాలు ఎంటర్ చేయాలి. మీరు ఈ స్కీమ్‌లో జమ చేసేందుకు మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఎంత జమ చేయాలనుకుంటున్నారో కూడా వెల్లడించాలి. ఆ తర్వాత ఫామ్ సబ్మిట్ చేయాలి. అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)