SBI Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు చేతికొస్తాయి
SBI Scheme: ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతీ నెల డబ్బులు చేతికొస్తాయి
SBI Annuity Deposit Scheme | మీ దగ్గర ఉన్న డబ్బుల్ని దాచుకోవాలనుకుంటున్నారా? అలా దాచుకోవడమే కాదు... మీ ఇన్వెస్ట్‌మెంట్‌పై రిటర్న్స్ కూడా వస్తాయి. నెలనెలా మీ చేతికి మీరు కోరుకున్నంత డబ్బులు పొందొచ్చు. ఎస్బీఐలో ఉన్న ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి.
1. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత నెలనెలా కొంత మొత్తం పొందాలనుకుంటున్నారా? మీలాంటివాళ్ల కోసమే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌ను అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. ఇందులో ఒకేసారి డబ్బులు పెడితే... ప్రతీ నెల మీరు కోరుకున్న మొత్తాన్ని తిరిగి పొందొచ్చు. దాంతోపాటు మీకు వడ్డీ కూడా లభిస్తుంది. ఒకేసారి పెద్దమొత్తంలో డిపాజిట్ చేసి, ప్రతీ నెల డబ్బులు కావాలనుకునేవారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఈ అకౌంట్ ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. సింగిల్‌గా లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. గరిష్టంగా ఎంత ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన ఏమీ లేదు. కనీసం రూ.25,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కనీసం మంత్లీ యాన్యుటీ రూ.1,000 నుంచి పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్‌లో 36, 64, 84 లేదా 120 నెలలు కాల వ్యవధి ఎంచుకోవాల్సి ఉంటుంది. డిపాజిట్లపై ఎస్బీఐ నిర్ణయించిన వడ్డీ రేట్లే ఈ స్కీమ్‌కు వర్తిస్తాయి. ప్రస్తుతం 6.25 % శాతం వడ్డీ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. ఈ స్కీమ్‌కు రుణ సదుపాయం కూడా ఉంది. మీ డిపాజిట్లో ఉన్న బ్యాలెన్స్ నుంచి 75% వరకు లోన్ తీసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రాంచ్ మేనేజర్ విచక్షణపై ఇది ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. లోన్ తీసుకున్న తర్వాత యాన్యుటీ పేమెంట్ లోన్ అకౌంట్లో డిపాజిట్ అవుతుంది. డిపాజిటర్ చనిపోతే ప్రీమెచ్యూర్ పేమెంట్ వర్తిస్తుంది. ఈ స్కీమ్‌కు నామినేషన్ సదుపాయం కూడా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)