SBI Customers Alert: మీకు జన్‌ధన్ బ్యాంక్ ఖాతా ఉందా? అది కూడా SBI బ్యాంకులో ఉందా? ఐతే మీకే ఈ శుభవార్త. జన్‌ధన్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది.
మీకు జన్‌ధన్ బ్యాంక్ ఖాతా ఉందా? అది కూడా SBI బ్యాంకులో ఉందా? ఐతే మీకే ఈ శుభవార్త. జన్‌ధన్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
'ఎస్బీఐ రూపే జన్‌ధన్ కార్డు'కు దరఖాస్తు చేసుకోవాలని కస్టమర్లకు సూచించింది. ఈ కార్డుతో పాటు రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాలు ఉచితంగా అందుతాయని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ప్రమాద బీమా వర్తించాలంటే ప్రతి 90 రోజులకు కనీసం ఒక్క రోజైనా రూప్ జన్‌ధన్ కార్డును స్వైప్ చేయాల్సి ఉంటుంది. అలాంటి వారిందరికీ రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది.
4/ 7
ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద దేశంలోని నిరు పేదలందరికీ ఉచితంగా బ్యాంక్ అకౌంట్లు తెరిచిన విషయం తెలిసిందే. అందరికీ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, నగదు బదిలీ పథకం సేవలు అందాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు చేరుగా జన్‌ధన్ ఖాతాల్లో జమచేస్తారు. ఉచిత మొబైల్ బ్యాంకింగ్ సదుపాయం ఉంటుంది. అన్ని ఖాతాల మాదిరే పొదుపుపై వడ్డీ కూడా అందుతుంది.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
జన్‌ధన్ ఖాతాదారులకు రూ. 30వేల జీవిత బీమా, రూ.2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనాలు కలుగుతాయి. దేశమంతటా మనీ ట్రాన్స్ఫర్ సదుపాయం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
కేంద్ర ప్రభుత్వం జన్‌ధన్ యోజన కింద దేశవ్యాప్తంగా 41.75 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచింది. ఇందులో 35.96 కోట్ల ఖాతాలు ఆపరేటివ్‌గా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)