ఇదిలా ఉంటే.. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) , ప్రైవేట్ రంగ బ్యాంకు 'యాక్సిస్ బ్యాంక్' తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు రెండూ రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌కు అనుగుణంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎంపిక చేసిన టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ) పై వడ్డీరేటు 15 బేసిక్ పాయింట్లు పెంచేసింది.
180 నుండి 210 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేటు 4.40 శాతం నుండి 4.55 శాతం కి పెంచబడింది. అయితే 211 రోజుల నుండి 1 సంవత్సరం వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై మునుపటిలాగే 4.60 శాతం వడ్డీ కొనసాగుతుంది. అంతే కాకుండా.. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల FDలపై వడ్డీ 5.30శాతం నుండి 5.45శాతంకి, 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల FDలలో 5.35 శాతం నుండి 5.50శాతానికి , 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల FDలపై 5.45 శాతం నుండి 5.60 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
ఏడు రోజుల గడువు నుంచి పదేండ్ల లోపు గడువు వరకు గల ఫిక్స్డ్ డిపాజిట్లకు ఇది వర్తిస్తుంది. తాజా ఫిక్స్డ్ డిపాజిట్లకు, మెచ్యూర్డ్ డిపాజిట్ల రెన్యూవల్స్‌కు వడ్డీరేట్ల పెంపు వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లకు పెంచిన వడ్డీరేట్లు అమలు కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
యాక్సిస్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో 7 రోజుల నుండి 1 సంవత్సరం 25 రోజుల వరకు ఎలాంటి మార్పు చేయలేదు. దీని కారణంగా.. మునుపటిలాగానే 7 రోజుల నుండి 29 వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.50 శాతం, 30 రోజుల నుండి 3 నెలల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3 శాతం, 3 నెలల నుండి 6 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.65శాతం వడ్డీ అందుబాటులో కొనసాగుతుంది.
ఇది కాకుండా, 18 నెలల నుండి 2 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలకు 5.60శాతం, 2 సంవత్సరాల నుండి 30 నెలల వరకు, 30 నెలల నుండి 3 సంవత్సరాల వరకు, 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు అండ్ 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలకు 5.70శాతం వడ్డీ లభిస్తుంది. ఫిక్సెడ్ డిపాజిట్లపై బ్యాంక్ కస్టమర్లకు 5.75శాతం వడ్డీని ఇస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)