SBI Amrit Kalash Deposit Scheme | దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ – SBI) కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. వీటిల్లో ఫిక్స్డ్ డిపాజిట్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఎస్బీఐ బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రత్యేకమైన స్కీమ్స్ అందుబాటులో ఉంచింది.
డొమెస్టిక్ లేదా ఎన్ఆర్ఐ కస్టమర్లు ఇద్దరికీ ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. అందువల్ల ఎవరైనా డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. అధిక వడ్డీ రాబడి పొందొచ్చు. ఈ ఎఫ్డీ స్కీమ్‌పై ప్రిమెచ్యూర్ విత్‌డ్రాయెల్, లోన్ ఫెసిలిటీ వంటివి ఉన్నాయి. ఈ స్కీమ్‌లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో రూ. 8 వేల రాబడి పొందొచ్చు.