Stocks To Buy | స్టాక్ మార్కెట్ అదరగొట్టింది. ఎఫ్ఐఐల ఇన్వెస్ట్మెంట్లతో నిఫ్టీ దుమ్మురేపింది. ఈ ఏడాది నిఫ్టీ దాదాపు 4 శాతం మేర ర్యాలీ చేసింది. జూలై నెల నుంచి ఫారిన్ ఫండ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో సూచీలు కూడా పరుగులు పెట్టాయి. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ డైరెక్ట్ 2023కి గానూ ఆరు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆటో విడిభాగాల తయారీ కంపెనీ అయిన భారత్ ఫోర్జ్ స్టాక్‌ను కొనొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ సూచిస్తోంది. ఈ స్టాక్ ఇటీవల జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. ఈ షేరు రానున్న కాలంలో కూడా అప్‌ట్రెండ్ కొనసాగించే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ పేర్కొంటోంది. రూ. 875 నుంచి 900 రేంజ్లో కొనొచ్చని టార్గెట్ ప్రైస్‌ను రూ. 1150గా నిర్ణయించింది. అంటే షేరు ధర 30 శాతం పెరిగే ఛాన్స్ ఉంది. స్టాప్ లాస్ రూ. 730గా పెట్టుకోవాలి.