దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన ఖాతాదారులకు కీలక ప్రకటన చేసింది. పలు సేవల్లో అంతరాయం కలగనున్నట్లు ప్రటించింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
ఎస్బీఐకి సంబంధించి ఫిర్యాదులు, వినతుల చేసేందుకు వినియోగించే పోర్టల్ https://crcf.sbi.co.in ఈ నెల 26వ తేదీ రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఈ నెల 27న ఉదయం 6 గంటల వరకు పని చేయదని వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
నిర్వహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనున్నట్లు SBI తెలిపింది. ఖాతాదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని బ్యాంకు కోరింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఖాతాదారులు ఈ సమయంలో లావాదేవీలపై ఫిర్యాదులు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ ఫోన్ నంబర్లు 1800112211/18001234/18002100ను సంప్రదించాలని సూచించారు.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
సైబర్ నేరాలపై ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని.. ఓటీపీ, కార్డు నంబర్లు, సీవీవీ తదితన వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని ఎస్బీఐ స్పష్టం చేసింది.(ఫొటో: ట్విట్టర్)