SBI ALERT TO CUSTOMERS OVER INTERRUPTION IN INTERNET BANKING SERVICES NS
SBI ఖాతాదారులకు అలర్ట్.. 5 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎప్పటినుంచంటే..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు తాజాగా కీలక ప్రకటన చేసింది. దాదాపు ఐదు గంటల పాటు బ్యాంకింగ్ సేవల్లో (Banking Services) అంతరాయ కలుగుతుందని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉందా? ఆన్లైన్ లావాదేవీలను ఎక్కువగా నిర్వహిస్తూ ఉంటారా? అయితే మీకు అలర్ట్.. ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్, యూపీఐ తదితర సేవలపై బ్యాంకు తాజాగా కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
టెక్నాలజీ అప్ గ్రేడ్ కారణంగా బ్యాంకింగ్ సేవలను దాదాపు ఐదు గంటల పాటు నిలిపివేయనున్నట్లు బ్యాంకు తెలిపింది. ఈ మేరకు బ్యాంకు తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
డిసెంబర్ 11 అంటే శనివారం రాత్రి 11.30 గంటల నుంచి డిసెంబర్ 12 ఉదయం 4.30 గంటల వరకు అంటే ఐదు గంటల పాటు బ్యాంకు అందించే పలు సేవలు పనిచేయవని బ్యాంకు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
ఇంటర్ నెట్ బ్యాంకింగ్ (INB), యోనో(Yono), యోనో లైట్ (Yono Lite), యోనో బిజినెస్ (Yono Business), యూపీఐ (UPI) లాంటి సేవలు ఆ సమయంలో అందుబాటులో ఉండవని బ్యాంకు వివరించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
ఖాతాదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని బ్యాంకు కోరింది. పేన పేర్కొన్న సమయం అనంతరం బ్యాంకు సేవలు తిరిగి ప్రారంభమవుతాయని బ్యాంకు వెల్లడించింది.(Photo: Twitter)