నకిలీ యాప్‌ల ద్వారా కేటుగాళ్లు అమాయకులకు గాలం వేస్తూ అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారులంతా అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులను మరోసారి అప్రమత్తం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
గుర్తు తెలియని లింకులు/వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు స్పందించొద్దని సూచించింది. ‘ఎవరినైనా మీ ఇంట్లోకి అనుమతించే ముందు తలుపు అవతల ఎవరున్నారో తనిఖీ చేసుకోండి’ అని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేసింది ఎస్బీఐ. ఈ మేరకు #SafeWithSBI అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
పర్సనల్ అకౌంట్ నంబర్లు, పాస్వర్డ్స్ సహా ఏదైనా ఇతర సున్నితమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయవద్దని SBI తన వెబ్సైట్లో వినియోగదారులను నిర్దేశించింది. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని స్పష్టం చేసింది. SBI, SB తో ప్రారంభమయ్యే షార్ట్‌కోడ్‌ను బట్టి మాత్రమే అంటే SBIBNK, SBIINB, SBIPSG, SBYONO వంటి పదాలుంటేనే ఎస్బీఐ నుంచి మెసేజ్ వచ్చినట్లుగా భావించాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
దీనిలో భాగంగా ఖాతాకు సంబంధించిన సమాచారం అప్డేట్, అకౌంట్ యాక్టివేషన్, ఫోన్ నంబర్‌కు కాల్ చేయడం, గుర్తింపు ధ్రువీకరణ తెలియజేసే టెక్స్ట్ మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని కస్టమర్లను కోరింది. కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోసం ఎస్బీఐ ఈ-మెయిల్/ఎస్ఎంఎస్ పంపదని, ఫోన్ కాల్స్ చేయదని స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)